ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమావేశాలు అక్టోబర్ 1 న ముగియనున్నాయి.
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమావేశాలు అక్టోబర్ 1 న ముగియనున్నాయి. కోవిడ్-19 గైడ్ లైన్స్ మేరకు రాజ్యసభ వేర్వేరు సమయాల్లో సమావేశమవుతుంది. అలాగే మొత్తం 18 వరుస సిటింగ్స్ లో నాలుగు వారాలపాటు సమావేశాలు జరగవచ్చు. మొదటి రోజున రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. జేడీ-యూ ఎంపీ హరివంశ్ మళ్ళీ ఈ పదవికి ఎన్నిక కావచ్ఛునని భావిస్తున్నారు. కరోనా వైరస్ తరుణంలో ఈ పార్లమెంట్ సమావేశాల నిర్వహణకోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నారు.