ఇండియాలో కరోనా కల్లోలం : ఒక్కరోజులో 819 మంది మృతి !
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,921 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 819మంది కొవిడ్ వల్ల ప్రాణాలు విడిచారు.
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 69,921 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 819మంది కొవిడ్ వల్ల ప్రాణాలు విడిచారు. కాగా దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,91,167కు చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28,39,883 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 65,288 మంది కరోనాకు బలయ్యారు.
మొత్తం కేసులు 36,91,167 కొత్త కేసులు 69,921
మొత్తం మరణాలు 65,288 కొత్త మరణాలు 819
కాగా కేవలం ఆగస్టు నెలలోనే ఇండియాలో దాదాపు 20లక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే నెల వ్యవధిలో ఇన్ని కేసులు ప్రపంచంలో ఏ కంట్రీలోనూ నమోదుకాలేదు. భారత్‌లో ఆగస్టు నెలలోనే రికార్డు రేంజ్‌లో 19లక్షల 50వేల కేసులు వెలుగుచూశాయి. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు కూడా గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం. రికవరీ రేటు 76శాతం దాటగా, మరణాల రేటు 1.7శాతంగా కొనసాగుతోంది.
Also Read :
ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ !