AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు కొనసాగుతున్నాయి. మార్కులను గణించే విధానాన్ని..

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు
Supreme Court
Subhash Goud
|

Updated on: Jun 17, 2021 | 12:40 PM

Share

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు కొనసాగుతున్నాయి. మార్కులను గణించే విధానాన్ని సీబీఎస్ఈ సుప్రీం కోర్టుకు అందజేసింది. 10వ తరగతి మార్కులు, 11, 12వ తరగతి యూనిట్ టెస్టుల మార్కుల ఆధారంగా గణన చేపట్టనుంది. అయితే 13 మంది నిపుణులతో కూడిన కమిటీ సిఫార్సు చేసిందని వెల్లడించింది. 1929 నుంచి సీబీఎస్ఈ బోర్డు ఉందని, ఇన్నేళ్లలో ఈ పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కొలేదని న్యాయస్థానం తెలిపింది. మార్కులపై అభ్యంతరాలుంటే పరిష్కరించే మెకానిజం ఉండాలన్న సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. గత ఏడాది కూడా అనేక మంది మార్కులపై అభ్యంతరాలు చెబుతూ కోర్టును ఆశ్రయించారని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన అటార్నీ జనరల్ .. కొత్త విధానంలో గణించిన మార్కులను జులై 31న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మార్కులపై అభ్యంతరాలున్నవారు పరీక్షలు కోరుకుంటే, గతేడాది తరహాలో తర్వాత విడిగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

గత ఏడాది కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు కోరుకున్నారని ఏజీ వెల్లడించగా, తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలనే పద్ధతికి వ్యతిరేకం.. కోరుకున్న వారికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండాలని అంటున్నాం. ఇందుకోసం ఒక టైమ్ లైన్ ఏర్పాటు చేయాలి అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు పరీక్షలు పెట్టాలన్న అభ్యర్థనలను సుప్రీం కోర్టు తోసిపుచ్కచింది.

ఇవీ కూడా చదవండి:

Cooking Oil Price: సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు.. ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం

BMI: పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయం ప్రభావం.. 51 శాతం పిల్లల్లో అనారోగ్య సమస్యలు: సర్వేలో వెల్లడి