Tamil Nadu: తమిళనాడులో ఎలుగుబంటి దాడి.. ముగ్గురికి గాయాలు.. అటవీ అధికారులు విఫలం అంటూ ఆరోపణలు

పొదల్లో నక్కిఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. బైక్‌ మీద నుంచి పడిపోయిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అతనిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తలను కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది. ఇదంతా కెమెరాలో చిక్కుకుంది.

Tamil Nadu: తమిళనాడులో ఎలుగుబంటి దాడి.. ముగ్గురికి గాయాలు.. అటవీ అధికారులు విఫలం అంటూ ఆరోపణలు
Bear Attack In Temilnadu
Follow us
Surya Kala

|

Updated on: Nov 07, 2022 | 4:37 PM

తమిళనాడులో ఎలుగుబంటి అటవీప్రాంతాన్ని విడిచి జనావాసంలోకి వచ్చింది. ఆవేశంతో రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ముగ్గురినీ గాయపరిచింది. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. వైకుంఠమణి అనే వ్యక్తి మసాలా దినుసులు తీసుకుని తన బైక్‌ మీద వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. బైక్‌ మీద నుంచి పడిపోయిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అతనిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తలను కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది. ఇదంతా కెమెరాలో చిక్కుకుంది.

దాడి చేస్తోన్న ఎలుగుబంటి 

ఇవి కూడా చదవండి

ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్షతగాత్రుడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అయితే కడయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు అప్పుడప్పుడు పెంపుడు జంతువులపై దాడి చేస్తాయి.. కానీ తొలిసారిగా మనుషులపై దాడులకు పాల్పడ్డాయని స్థానికులు చెప్పారు. వన్యప్రాణులు నివాస ప్రాంతాలలోకి చొరబడకుండా సోలార్ కంచె, తవ్విన కందకాన్ని నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు.  కడయం అటవీ రేంజ్ కార్యాలయం ముందు రహదారిని దిగ్బంధించారు. ఈ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి ఎలుగుబంటి దాడి అని నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాంలో ఇరుక్కున్న జబర్దస్త్ రీతూ చౌదరి..
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
మీరు ఎక్కాల్సిన ట్రైన్.. లేటు కాదు.. గతంలో చూడనంత గ్రేట్!
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ఓరీ దేవుడో ఇదేం వింతకాఫీరా సామీ..!రుచి గురించి వింటే షాక్ తింటారు
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
ముగిసిన 2వ రోజు.. 6 వికెట్లు కోల్పోయిన భారత్.. ఆధిక్యం ఎంతంటే?
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
పాత బట్టలు పడేసే ముందు ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
న్యూ ఇయర్ ఎంజాయ్‌మెంట్ కోసం అడవిలోకి వెళ్లారు.. వామ్మో.. చివరకు..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
ప్రేమలో పడ్డ శ్రీలీల.. త్వరలోనే..
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
మరీ లక్షల్లో ఏంటి గురూ..!ఈటోస్ట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులుఔట్
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. రెండో భారత ఆటగాడిగా రిషబ్ పంత్..
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే
బ్లాక్ చీతాను ఎప్పుడైనా చూశారా..? వీడియో చూస్తే షాకవ్వాల్సిందే