ద్విపాత్రాభినయంతో ఆహా అనిపించిన టాలీవుడ్ భామలు..

04 January 2025

Battula Prudvi

హీరోలు డ్యూయల్ రోల్స్ చేసిన సినిమాలు చాలా చూసాం. అయితే టాలీవుడ్ హీరోయిన్స్ కూడా ద్విపాత్రాభినయం చేసారు.

లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కెరీర్ టర్నింగ్ మూవీ అరుంధతితో పాటు పంచాక్షరి, వర్ణ చిత్రాల్లో రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకుంది.

హారర్ థ్రిల్లర్ చిత్రం చారులతలో ప్రియమణి డ్యూయల్ రోల్‎లో నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా ద్విపాత్రాభినయం చేశారు. మోహిని అనే హారర్ మూవీలో ప్రేక్షకులను భయపెట్టింది.

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ సమంత కూడా డ్యూయల్ రోల్‎లో మెప్పించింది. 10 అనే సినిమా లో రెండు విభిన్న పాత్రల్లో కనిపించింది సామ్.

పునర్జన్మ ఆధారంగా వచ్చిన రామ్ ఎందుకంటే ప్రేమంట చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా రెండు పాత్రల్లో అలరించింది.

తెలుగు అమ్మాయి అంజలి కూడా హారర్ కామెడీ చిత్రం గీతాంజలిలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను భయపెట్టింది.

రాజమౌళి మగధీర చిత్రంలో యువరాణి మిత్రవిందగా, ఇందుగా ఆకట్టుకుంది అందాల తార కాజల్ అగర్వాల్. రామ్ చరణ్ ఈ చిత్రంలో హీరో.