కారు ముక్కలైంది.. ఇంజిన్ 50 అడుగులు ఎగిరిపోయింది.. అయినా నలుగురు యువకులు క్షేమం! షాకింగ్ ప్రమాదం వీడియో
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తలోడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసింది. టెస్ట్ డ్రైవ్ చేస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఇంజిన్ 50 అడుగుల దూరంలో పడిపోయింది. కారు పూర్తిగా ధ్వంసమైనప్పటికీ అందులో ఉన్న నలుగురు యువకులు సురక్షితంగా బయటపడటం అద్భుతంగా మారింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవగా, వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అదృష్టం వారిని కాపాడింది కారు ముక్కలైనా ప్రాణాలు నిలిచాయి. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను నిర్ఘాంతపరిచింది. కొత్తగా కొన్న పాత కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం కారును పూర్తిగా ధ్వంసం చేసింది. కానీ అందులో ఉన్న నలుగురు యువకులూ సురక్షితంగా బయటపడటం అక్షరాలా అద్భుతమే.
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా, తలోడా పట్టణంలో ఒక కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఇటీవల కొన్న పాత కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారును డ్రైవర్ నియంత్రించలేకపోయాడు. కారు నేరుగా విద్యుత్ స్తంభానికి గుద్దుకుంది. ఢీకొన్న కారు ఇంజిన్ విరిగిపోయి దాదాపు 50 అడుగుల దూరంలో పడిపోయింది. కారు గాల్లో రెండు మూడు సార్లు పల్టీలు కొడుతూ దగ్గరలోని నిర్మాణ స్థలంలో ఇనుప రాడ్లు, శిథిలాల మధ్యన పడింది. కారులో ఉన్న నలుగురు యువకులూ సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా ధ్వంసమైనా వారికి ప్రాణహాని తప్పింది. సమీపంలోని సీసీటీవీలో సంఘటన రికార్డైంది. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద వీడియో..
