AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టర్కీపై దాడి చేయాలంటే సెకన్ల పని! అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి టర్కీకి దూసుకెళ్లే క్షిపణి మనదగ్గరుంది..!

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారతదేశం దాని అగ్ని-5 క్షిపణితో టర్కీని లక్ష్యంగా చేసుకోగలదు. అగ్ని-5 5000 కి.మీ పరిధి, 1.5 టన్నుల అణుయుద్ధ శిరస్సులను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి బలం. ఇది భారతీయ క్షిపణి సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.

టర్కీపై దాడి చేయాలంటే సెకన్ల పని! అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి టర్కీకి దూసుకెళ్లే క్షిపణి మనదగ్గరుంది..!
Agni 5
SN Pasha
|

Updated on: May 15, 2025 | 6:56 PM

Share

భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమయంలో టర్కీ(తుర్కియో) పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. దీంతో ఇండియన్స్‌ ఆ దేశంపై ఆగ్రహంగా ఉన్నారు. పాకిస్థాన్‌తో పాటు పనిలో పనిగా టర్కీ పని కూడా పట్టేయాలంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇక్కడ నుంచి నేరుగా టర్కీ దేశంలో ఏ ప్రదేశంపైనైనా దాడి చేయగల సత్తా ఇండియాకు ఉంది. ఒక్క బటన్‌ నొక్కితే చాలా అగ్ని-5 అనే క్షిపణి టర్కీ దేశంపైకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించగలదు.

ఇండియా అగ్ని-5 క్షిపణి ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి టర్కీ వరకు దాడి చేయగల సామర్థ్యం కలిగిన క్షిపణి. భారతదేశం నుండి టర్కీకి దూరం దాదాపు 4500-5000 కిలోమీటర్లు. అగ్ని-5 క్షిపణి పరిధి కూడా అంతే. అగ్ని-5 భారతదేశంలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, దీనిని DRDO అభివృద్ధి చేసింది. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి.

అగ్ని-5 క్షిపణి 1.5 టన్నుల వరకు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు. అగ్ని-5 శ్రేణి మొత్తం ఆసియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని ఉత్తర ప్రాంతాలను కవర్ చేస్తుంది. భారతదేశ క్షిపణి సాంకేతికతలో అగ్ని-5 ఒక మైలురాయి. అగ్ని-5 క్షిపణి టర్కీలోని ఏ ప్రాంతాన్ని అయినా లక్ష్యంగా చేసుకోగలదు. భారత్‌, టర్కీ మధ్య సైనిక వివాదం లేనప్పటికీ, ఉద్రిక్తతలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా అది పెద్ద తప్పు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..