AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ద మనుసు చాటుకున్న చిన్నారి! ఇండియన్‌ ఆర్మీ కోసం విరాళం..

తమిళనాడులోని కరూర్‌కు చెందిన ఎనిమిది ఏళ్ల బాలుడు తన పొదుపు డబ్బును భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పది నెలలుగా తన పాకెట్ మనీ, ఇతరుల నుండి వచ్చిన డబ్బును దాచుకుని, కలెక్టర్ కార్యాలయంలో విరాళం అందించాడు. ఈ చిన్నారి దేశభక్తి, సహాయపడే మనస్సు అందరినీ ప్రభావితం చేసింది. ఈ ఘట్టం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెద్ద మనుసు చాటుకున్న చిన్నారి! ఇండియన్‌ ఆర్మీ కోసం విరాళం..
Boy Donation To Indian Army
SN Pasha
|

Updated on: May 15, 2025 | 6:33 PM

Share

చిన్న పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు కావాలని అల్లరి చేయడమే కాదు.. కొంతమంది ఇలా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుంటారు. తమిళనాడులోని కరూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల విద్యార్థి తన కిట్టీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బుని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చాడు. గత 10 నెలలుగా రెండవ తరగతి విద్యార్థి తన పాకెట్ మనీ, కుటుంబ సభ్యుల ఇచ్చిన డబ్బును దాచుకుంటున్నాడు. ఇప్పుడా డబ్బులను ఇండియన్ ఆర్మీకి విరాళాలను అందజేశాడు. చిన్నారి చేసిన ఈ పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం విరాళం అందిస్తున్న ఆ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కరూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయంగా విరాళం అందించాడు. బాలుడు నాణేలు, నోట్లతో నిండిన వాటర్ ట్యాంక్ ఆకారపు డబ్బు బ్యాంకును మోసుకెళ్లాడు. ‘నేను రెండవ తరగతి చదువుతున్నాను. మమ్మల్ని రక్షించే వారికి సహాయం చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆర్మీ సైనికులకు ఇవ్వడానికి నా డబ్బునంతా దాచుకున్నాను’ అని బాలుడు కలెక్టర్ కార్యాలయం వెలుపల మీడియాతో చెప్పాడు. కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు విరాళం మొత్తాన్ని బహిరంగంగా వెల్లడించలేదు, కానీ రసీదును అందించి, చిన్నారిని ప్రశంసించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు