PMGKAY Scheme: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. పీఎంజీకేఏవై మరో 5 నెలలు పొడిగింపు
PMGKAY free ration scheme: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు
PMGKAY free ration scheme: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు (నవంబరు) పొడిగించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద సుమారు 81.35 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా రేషన్ లభించనుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లబ్ధిపొందుతున్న పేదలు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ఈ ఏడాది జూన్ వరకు రెండు నెలలు పొడిగించారు. అయితే.. దానిని మరో ఐదు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల ప్రారంభంలో.. జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గరీబ్ కల్యాణ్ యోజనను ఈ ఏడాది దీపావళి వరకు మరో ఐదు నెలలపాటు పొడించనున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ప్రధాని నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పథకం పొడిగింపు ప్రతిపాదనను ఆమోదించింది. పీఎంజీకేఏవై కింద (నాలుగో దశ) అదనపు ఆహారధాన్యాల సరఫరాను మరో ఐదు నెలలపాటు అదనంగా కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ పథకం కింద ఒక్కొక్క లబ్ధిదారునికి నెలకు 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా అందజేయనున్నారు. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి కిలో రూ. 1-3 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్న ఆహారధాన్యాలకు ఇది అదనమని ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది.
Also Read: