Anand Mahindra: ఆటో కరెక్ట్..నెటిజన్లకు గట్టిగా కనెక్ట్..ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ చూస్తె మీరూ కనెక్ట్ అయిపోతారంతే!

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తన అనుచరులతో ట్విట్టర్లో స్ఫూర్తిదాయకమైన పోస్ట్లు సరదా వీడియోలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఓ చిన్న వీడియో క్లిప్ తో నెటిజన్లను ఆకట్టుకున్నారు.

Anand Mahindra: ఆటో కరెక్ట్..నెటిజన్లకు గట్టిగా కనెక్ట్..ఆనంద్ మహీంద్రా తాజా ట్వీట్ చూస్తె మీరూ కనెక్ట్ అయిపోతారంతే!
Anand Mahindra
Follow us
KVD Varma

|

Updated on: Jun 23, 2021 | 10:45 PM

Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తన అనుచరులతో ట్విట్టర్లో స్ఫూర్తిదాయకమైన పోస్ట్లు సరదా వీడియోలను పంచుకుంటారు. తాజాగా ఆయన ఓ చిన్న వీడియో క్లిప్ తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. చాలా చిన్న వీడియో ఇది. కానీ, దీనిని చూస్తే మాత్రం అందరూ కచ్చితంగా గుండెల మీద చేయి వేసుకుని అమ్మో అనుకుంటారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక చిన్న సందు. దానిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో వేగంగా ఆ సందులోకి ఒక ఆటో దూసుకు వచ్చింది. అక్కడ సందులో వేగంగా తిరగడంలో అది దాదాపుగా ఒక పక్కకు పూర్తిగా పడిపోయే పరిస్థితిలోకి వచ్చినట్టు అయింది. అదే సమయంలో దానినుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి వేగంగా స్పందించి ఆ ఆటోను ఒక్కసారిగా పక్కకు తోసాడు. దీంతో పడిపోతుంది అనిపించినా ఆటో సక్రమంగా అయిపోయి వేగంగా వెళ్ళిపోయింది. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. అయినా దీనిని వీడియో చూస్తేనే మీకు సరిగ్గా కనెక్ట్ అవుతుంది. అందుకే ఆ వీడియో ఇక్కడ ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో చూసేయండి..

చూశారుగా.. ఇప్పుడు చెప్పండి ఏమంటారు. ఈ వీడియో చివర్లో ఇచ్చిన ‘ఆటో కరెక్ట్’ కరెక్టే అని ఒప్పుకుంటారు కదూ. దీనికి ఆనంద్ కూడా మంచి కామెంట్ రాశారు. ” దేశి ‘టెక్-హ్యూమర్’ను ఏమీ కొట్టడం లేదు. డిజిటల్ పదాల ఇలాంటి దేశీ వర్ణనలను చూడటానికి నేను ఇష్టపడతాను. ‘స్పెల్ చెక్’ కోసం మీరు ఏమి చూపిస్తారు? ధ్యానం చేసే గురువుని చూస్తున్న భక్తుడు?” అంటూ రాశారు. ఇక ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది ట్విట్టర్ లో. చాలామంది దానికి కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్ల ట్వీట్ లు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అన్నట్టు ఆనంద్ మహీంద్ర ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సరదా అయిన ట్వీట్ లు చేస్తూనే ఉంటారు. ఆయన్ని అనుసరించే వారు ఎప్పుడూ మంచి విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. ఈ వీడియో చిన్నదైనా అద్భుతమైనదని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

RPF Saves Woman: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. పట్టు తప్పి పడిపోతుండగా రక్షించిన రైల్వే కానిస్టేబుల్