AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RPF Saves Woman: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. పట్టు తప్పి పడిపోతుండగా రక్షించిన రైల్వే కానిస్టేబుల్

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణీకురాలు అదుపుతప్పి పడబోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఆపద్బందువుడిలా వచ్చి కాపాడారు.

RPF Saves Woman: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ.. పట్టు తప్పి పడిపోతుండగా రక్షించిన రైల్వే కానిస్టేబుల్
Railway Constable Saves Woman
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 23, 2021 | 11:29 AM

Railway Constable Saves Woman: కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణీకురాలు అదుపుతప్పి పడబోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ ఆపద్బందువుడిలా వచ్చి కాపాడారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీ రైల్వే స్టేషన్‌లో జరిగింది. బాధితురాలు ఆలస్యంగా రావటంతో రైల్వే ప్లాట్ ఫాం నుంచి ఆమె ఎక్కాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్ కదిలింది. లగేజీ బ్యాగ్‌తో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది మహిళా. అప్పటికే ట్రైన్ కదలడంతో పట్టు తప్పి రైలు కింద పడబోయింది. ప్రాణాలమీద ఆశ వదులుకుంది. అది గమనించిన ఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెను కాపాడారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు అక్కడి రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించి వీడియోను భారత రైల్వే శాఖ విడుదల చేసింది. తన ప్రాణాలను పణ్ణంగా పెట్టి కాపాడినందుకు సదరు మహిళ.. రైల్వే కానిస్టేబుల్‌కు ధన్యవాదాలు తెలుపుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రైల్వే కానిస్టేబుల్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

Read Also….. Viral Video: కూతురిని కొట్టడానికి వచ్చిన తల్లి.. అడ్డుపడిన పెంపుడు కుక్క.. చివరికి ఏం చేసిందంటే… వీడియో వైరల్..