పార్లమెంట్ సాక్షిగా.. “సీఏఏ”పై స్పష్టతనిచ్చిన రాష్ట్రపతి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రామ్‌నాథ్ కోవింద్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం అంశం కూడా ప్రసంగంలో వచ్చింది. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. సీఏఏ చట్టంతో గాంధీజీ కలలను సాకారం చేసినట్లైందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి శరణార్ధులుగా ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని తెలిపారు. వారికి పౌరసత్వం […]
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రామ్‌నాథ్ కోవింద్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో పౌరసత్వ సవరణ చట్టం అంశం కూడా ప్రసంగంలో వచ్చింది. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. సీఏఏ చట్టంతో గాంధీజీ కలలను సాకారం చేసినట్లైందన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి శరణార్ధులుగా ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని తెలిపారు. వారికి పౌరసత్వం ఇవ్వడమనేది మన కర్తవ్యమన్నారు. ఈ సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని.. అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఇక పాలనా విభాగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని.. ప్రభుత్వ సేవలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పౌరసత్వ సవరణ చట్టం ఎంతో అవసరమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రపతి ప్రసంగం చేస్తుండగా.. ముఖ్యంగా సీఏఏ అంశంపై ప్రస్తావిస్తుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాలు ప్లకార్డులతో నిరసన తెలిపాయి. నినాదాలతో సభను హోరెత్తించాయి. అయితే రాష్ట్రపతి నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు.