చికెన్‌లో కాకి మాంసం.. రామేశ్వరం గుడిలో ‘రామరామ’!
చికెన్ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయించిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. స్థానిక ఆలయంలోని కొందరు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అవి తిన్న కాకులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయి. అది చూసి ఆందోళన చెందిన భక్తులు.. అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. అనంతరం ఆ తర్వాత కూడా కొన్ని కాకులు అలాగే చనిపోయాయి. వాటిని కొందరు తీసుకుని చికెన్ […]
చికెన్ మాంసంలో కాకి మాంసాన్ని కలిపి విక్రయించిన ఘటన తమిళనాడులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. స్థానిక ఆలయంలోని కొందరు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం కాకులకు అన్నాన్ని ఆహారంగా వేశారు. అవి తిన్న కాకులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయి. అది చూసి ఆందోళన చెందిన భక్తులు.. అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు.
అనంతరం ఆ తర్వాత కూడా కొన్ని కాకులు అలాగే చనిపోయాయి. వాటిని కొందరు తీసుకుని చికెన్ దుకాణాలకు అమ్మడం గమనించిన పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా అసలు నిజం కక్కారు. కాకులు తింటున్న ఆహారంలో.. మద్యం కలిపామని.. అవి చనిపోయిన తర్వాత వాటిని చికెన్ దుకాణాలకు అముతున్నట్లు పేర్కొన్నారు. వారు రోడ్డు పక్కన చికెన్‌తో కూడిన పదార్థాల్లో ఈ కాకుల మాంసాన్ని కూడా కలిపి అమ్ముతున్నట్టు తేలింది. దీంతో చికెన్ స్టాళ్ల దుకాణాదారులతో పాటు, మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి 420 సెక్షన్ కింద చీటింగ్ కేసును నమోదు చేశారు. కాగా.. వారి నుంచి మరో 150 కాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.