కశ్మీర్‌లో మళ్లీ హై టెన్షన్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..

కశ్మీర్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగ్రోటా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వచ్చి.. పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ముగ్గురు ఉగ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది సమీపంలోని […]

కశ్మీర్‌లో మళ్లీ హై టెన్షన్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 31, 2020 | 1:10 PM

కశ్మీర్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నగ్రోటా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు చెకింగ్ చేస్తుండగా.. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఓ ట్రక్కులో వచ్చి.. పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ముగ్గురు ఉగ్రవాదుల్ని పోలీసులు మట్టుబెట్టారు. మరో ఉగ్రవాది సమీపంలోని అడవిలోకి పారిపోయాడు. పోలీసులు పారిపోయిన ఉగ్రవాదికోసం కూంబింగ్ చేపడుతున్నారు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా అటువైపు జాతీయ రహదారులపై భారీ భద్రతను ఏర్పాటు చేశారు.