4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

నాలుగురాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం (సీఈసీ) తేదీలను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, యూపీలోని హమీర్‌పూర్, కేరళలోని పల, త్రిపురలోని భదర్‌ఘాట్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో హుజూర్‌నగర్ స్ధానానికి ఎన్నికను మాత్రం ప్రకటించలేదు. ఈస్ధానంలో […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 26, 2019 | 4:06 AM

నాలుగురాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం (సీఈసీ) తేదీలను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, యూపీలోని హమీర్‌పూర్, కేరళలోని పల, త్రిపురలోని భదర్‌ఘాట్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో హుజూర్‌నగర్ స్ధానానికి ఎన్నికను మాత్రం ప్రకటించలేదు. ఈస్ధానంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ కుమార్‌రెడ్డి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపొందారు. దీంతో ఈ స్ధానానికి కూడ ఎన్నిక జరగాల్సి ఉంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu