బోర్డర్‌లో బుల్లెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్..!
సాధారణంగా మనం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ చూశాం.. అలాగే కార్లను కూడా చూశాం. అది కూడా.. సీఎం లెవల్‌లో ఉండే వ్యక్తులకు మాత్రమే వాటిని అలెర్ట్ చేస్థారు. కానీ.. వ్యవసాయం చేసే రైతులకు బుల్లెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్‌ని చూశారా..? ఏంటి ఆ రైతు.. అంతగొప్పవాడా.. అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. అతను కూడా ఓ సాధారణ రైతే. వివరాల్లోకి వెళ్తే.. జవాన్‌ల భద్రతల మధ్య ఓ రైతు.. బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్‌తో తన వ్యవసాయ […]
సాధారణంగా మనం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్స్ చూశాం.. అలాగే కార్లను కూడా చూశాం. అది కూడా.. సీఎం లెవల్‌లో ఉండే వ్యక్తులకు మాత్రమే వాటిని అలెర్ట్ చేస్థారు. కానీ.. వ్యవసాయం చేసే రైతులకు బుల్లెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్‌ని చూశారా..? ఏంటి ఆ రైతు.. అంతగొప్పవాడా.. అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. అతను కూడా ఓ సాధారణ రైతే.
వివరాల్లోకి వెళ్తే.. జవాన్‌ల భద్రతల మధ్య ఓ రైతు.. బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్‌తో తన వ్యవసాయ పనులు మొదట పెట్టాడు. దానికి కారణం ఏంటంటే.. పాకిస్తాన్.. ఇండియా సరిహద్దు ప్రాంతం కావడంతో.. నిత్యం అక్కడ ఎన్‌కౌంటర్‌లు, ఎదురు కాల్పులు జరుగుతూనే ఉంటాయి. అందులోనూ.. పాకిస్తాన్ తరుచుగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వ్యవసాయం చేయాలంటే కత్తిమీద సాములాంటిది. గతంలో ఇలా వ్యవసాయం చేసే సమయంలో.. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. రంగంలోకి దిగిన ఆర్మీ… ఈ సరికొత్త బుల్లెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్‌ను తయారు చేశారు.
ఈ బుల్లెట్ ప్రూఫ్ ట్రాక్టర్‌ని తయారు చేయడానికి చాలా సమయమే పట్టింది. కాగా.. ఇది సోమవారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో.. ఈ వార్త వైరల్‌గా మారింది. స్థానిక రైతుకు.. సహాయంగా.. జవాన్లు పటిష్ఠ భద్రతను ఇవ్వడంతో.. తన పొలంలో ఈ ట్రాక్టర్‌తో వ్యవసాయం చేశాడు. అయితే.. ఇవి రైతులకు అందుబాటులోనే కొనుగోలు చేసే విధంగా తయారు చేస్తామని జవాన్లు తెలియజేశారు.