రాజ్యాంగాన్ని దెబ్బ తీసే బిల్లు.. రాహుల్ ఎటాక్

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీన్ని బుధవారం రాజ్యసభకు సమర్పించనున్నారు. అయితే ఇది రాజ్యాంగంలో పొందు పరచిన సెక్యులరిజానికి విరుధ్ధమని పలు ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్ […]

రాజ్యాంగాన్ని దెబ్బ తీసే బిల్లు.. రాహుల్ ఎటాక్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 10, 2019 | 3:25 PM

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదించింది. దీన్ని బుధవారం రాజ్యసభకు సమర్పించనున్నారు. అయితే ఇది రాజ్యాంగంలో పొందు పరచిన సెక్యులరిజానికి విరుధ్ధమని పలు ప్రతిపక్షాలు ఆరోపించాయి. లోక్ సభలో చివరిక్షణంలో దీనికి శివసేన మద్దతునివ్వడం విశేషం. (కానీ తన అధికార ‘ సామ్నా ‘ పత్రికలో సేన.. ఇది భారత విభజనకు దారి తీస్తుందని హెచ్చరించింది). దేశ ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ ఈ బిల్లుకు సపోర్ట్ ప్రకటించిందని సేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) మహారాష్ట్రకు మాత్రమే వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఈ బిల్లుపై మా పార్టీ మద్దతుకు, మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు ‘ అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు-లోక్ సభలో తమ పార్టీ ఈ బిల్లును సమర్థించినప్పటికీ.. ఓటింగ్ సమయంలో అనుకూలంగా ఓటు చేయకపోవచ్ఛునని శివసేన ‘ ట్రబుల్ షూటర్ ‘ సంజయ్ రౌత్ ట్వీట్ చేయడం విశేషం. కాగా- లోక్ సభలో కాంగ్రెస్, శివసేన ఒకే పంథాలో నడవకపో\వడాన్ని బీజేపీ ఓ కంట కనిపెడుతోంది.చివరి క్షణంలో సేన ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం పట్ల పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ హర్షం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.