AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు ‘ఉరిశిక్ష’ వద్దు.. సుప్రీంని ఆశ్రయించిన ‘నిర్భయ’ దోషి..!

నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్‌కుమార్‌ సింగ్‌.. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ.. నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని ఉన్న జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తున్నా.. ఇప్పటికే నా ఆయుష్షు తగ్గిపోయింది.. అంటూ అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్ వేశాడు. కాగా.. గతంలో ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు సమర్థించాయి. నిర్భయను అత్యంత […]

నాకు 'ఉరిశిక్ష' వద్దు.. సుప్రీంని ఆశ్రయించిన 'నిర్భయ' దోషి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 10, 2019 | 5:06 PM

Share

నిర్భయ కేసులో నిందితుడు అక్షయ్‌కుమార్‌ సింగ్‌.. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ.. నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఢిల్లీలోని ఉన్న జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తున్నా.. ఇప్పటికే నా ఆయుష్షు తగ్గిపోయింది.. అంటూ అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్ వేశాడు. కాగా.. గతంలో ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు సమర్థించాయి.

నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో.. నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఈ మృగాళ్లకు ‘ఉరి శిక్ష’ను అమలు చేయనున్నారు. ఈ కారణంగా.. ఇప్పుడు అమర్‌సింగ్ సుప్రీంని ఆశ్రయించాడు.

2012 డిసెంబర్‌ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని గాయపరిచి, అత్యంత హేయంగా ఢిల్లీ విధుల్లో బస్సులో తిప్పుతూ ఆమెను చెరపట్టారు. ఇప్పటికి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం.. నిర్భయ కేసు గురించి దేశ వ్యాప్తంగా చర్చకు తావులేపింది.

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?