PM Modi: వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడండి.. విపక్షాలకు ప్రధాని మోదీ సలహా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.
Parliament 2024 Budget session updates: నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.O బడ్జెట్‌పై ఈసారి భారీగా అంచనాలున్నాయి. ఏమైనా భారీ తాయిలాలు ప్రకటిస్తారా అని పారిశ్రామిక రంగాలు, వరాలు ప్రకటిస్తారనే ఆశలో మధ్యతరగతి వాళ్లు, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 2047 నాటికి వీక్షిత్ భారత్‌ను ఆవిష్కరించడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతోందన్న సంకేతాలు ఇప్పటికే పంపించింది కేంద్రం. దీనికి సంబంధించి ఆర్థికవేత్తలు, పరిశ్రమవర్గాలతో ప్రధాని మోదీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 23న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి నిర్మల సీతారామన్.. ఇవాళ పార్లమెంట్ లో ఆర్థిక సర్వేను ప్రకటించనున్నారు. అయితే.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.. 2047 నాటికి విక్షిత్ భారత్ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. మూడోసారి అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. అమృతకాలంలో ఇదొక అద్భుతమైన బడ్జెట్ అన్నారు. కొన్ని పార్టీలు పార్లమెంట్ వేదికగా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడిన ప్రధాని.. వచ్చే ఐదేళ్లు దేశాభివృద్ధి కోసం పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చారు..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ఫైర్ అయ్యారు. కొన్ని పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్లమెంటు సమయాన్ని ఉపయోగించుకున్నాయని, ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత సెషన్‌లో తనను మాట్లాడనివ్వకుండా చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయని , ప్రజాస్వామ్యంలో అలాంటి ఎత్తుగడకు తావులేదన్నారు. పార్లమెంట్ తొలి సెషన్‌లోనే 140 కోట్ల మంది దేశ ప్రజల మెజారిటీతో ఎన్నికైన ప్రభుత్వం గొంతును నొక్కే ప్రయత్నం చేశారన్నారు.
కేంద్ర బడ్జెట్ రానున్న ఐదేళ్ల ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుందని, 2047లో ‘విక్షిత్ భారత్’ కలను సాకారం చేసేందుకు పునాది వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని.. అమృత్ కాల్ లో ముఖ్యమైన బడ్జెట్ అని.. ఇది 2047లో విక్షిత్ భారత్ కలను నెరవేర్చడానికి పునాది వేస్తుందని తెలిపారు.
బడ్జెట్ సమావేశాలు లైవ్ వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..