Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు..
బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే.. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మన దేశంలో బంగారానికి భారీ డిమాండ్ ఉన్నా కూడా మనదగ్గర ఆ స్థాయిలో ఉత్పత్తి లేదు. దీంతో అంతర్జాతీయ దిగుమతులే ఆధారం.. ఈ క్రమంలో అంతర్జాతీయ అనిశ్చితులే పుత్తడి ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం (22 జులై 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 73,960 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 67,790 గా ఉంది. వెండి ధర కిలో రూ.91,400లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,790, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,960గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,790, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,960గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,940, 24 క్యారెట్ల ధర రూ.74,110 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.67,790, 24 క్యారెట్లు రూ.73,960, చెన్నైలో 22క్యారెట్లు రూ.68,340, 24 క్యారెట్లు రూ.74,560, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.67,790, 24 క్యారెట్లు రూ.73,960గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.91,400, ముంబైలో రూ.91,400, బెంగళూరులో రూ.91,550, చెన్నైలో రూ.95,900, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో రూ.95,900 లుగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..