Viral: చెత్తలో వెళ్లిపోయిన 5 లక్షల డైమండ్ నెక్లెస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు.. రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను వెతికి తీశారు. ఈ ఘటన చెన్నైలో వెలుగుచూసింది. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన విషయాన్ని గమనించారు. ఆ తర్వాత...
కార్పోరేషన్ అధికారులు వెంటనే స్పందించడం… పారిశుద్ధ్య కార్మికులు నిశితంగా వెతకడంతో చెన్నైలో డైమండ్ నెక్లెస్.. యజమానికి తిరిగి చేరింది. వివరాల్లోకి వెళ్తే… నగరవాసి దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం చేయించిన రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను ప్రమాదవశాత్తు చెత్తతో పాటు డంప్ చేశాడు. ఆలస్యంగా డైమండ్ విషయాన్ని గ్రహించిన ఫ్యామిలీ మెంబర్స్.. హుటాహుటిన చెన్నై కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు.. వ్యర్థాల నిర్వహణ కోసం చెన్నై కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు విషయం చేరవేశారు.
సీనియర్ అధికారులు కూడా రికవరీ ప్రయత్నాలను పర్యవేక్షించగా… పారిశుద్ధ్య కార్మికులు.. సమీపంలోని అన్ని చెత్త డబ్బాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో.. ఓ చెత్త కుప్పలో పూలమాలలో చిక్కుకుపోయి డైమండ్ నెక్లెస్ కనిపించడంతో అందరూ ఊరట చెందారు. చెన్నై కార్పొరేషన్ అధికారులు.. ఆ డైమండ్ నెక్లెస్‌ను తిరిగి యజమానికి అందజేశారు. తన సమస్య చెప్పగానే సత్వరమే స్పందించి.. విలువైన నెక్లెస్‌ను వెతికి ఇచ్చిన అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు దేవరాజ్ ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

