Microsoft: మైక్రోసాఫ్ట్‌లో టెక్నికల్ ఎర్రర్.. ఒక్కసారిగా స్తంభించిన ప్రపంచం.!
టెక్నికల్‌గా ఒక్క సమస్య.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో 'బ్లూ స్క్రీన్ ఎర్రర్'తో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలూ నిలిచిపోయాయి. బ్యాంకింగ్, టెలికాం, విమానయానరంగం ఇలా ప్రతిదీ ఎఫెక్ట్ అయ్యింది. మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది..
టెక్నికల్‌గా ఒక్క సమస్య.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపిస్తోంది. మైక్రోసాఫ్ట్‌లో ‘బ్లూ స్క్రీన్ ఎర్రర్’తో ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో అన్ని సేవలూ నిలిచిపోయాయి. బ్యాంకింగ్, టెలికాం, విమానయానరంగం ఇలా ప్రతిదీ ఎఫెక్ట్ అయ్యింది. మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలతో లండన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కూడా కుప్పకూలిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది.. ఏం జరిగింది.. సమస్యను ఎలా ఫిక్స్ చేయాలి అనేదానిపై మైక్రోసాఫ్ట్ టీమ్ యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు. హ్యాకింగ్ కారణమా.. టెక్నికల్ సమస్యా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులు, అమెరికాలో ఎమర్జెన్సీ సేవలు వాడే 911 కాల్ సెంటర్లు, విమానాశ్రయాలు, పోర్టులు సహా అనేక విభాగాల్లోనూ సేవలు నిలిచిపోయాయి.
Microsoft 365 యాప్‌లు, సేవలపై ఈ ప్రభావం పడింది. అంతర్జాతీయంగా మీడియా, విమాన.. బ్యాంకింగ్ తదితర సేవలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందీ సమస్య. లండన్ స్టాక్ ఎక్సేంజ్ సహా అనేక దేశాల్లో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలిగింది. ఒక్కసారిగా వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి ఏర్పడడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తోంది. ఆస్ట్రేలియాలో పేమెంట్ సిస్టమ్స్ పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. జర్మనీలోనూ ఈ ప్రభావం ఉంది. బెర్లిన్ విమానాశ్రయంలో అన్ని విమాన సేవలు సస్పెండ్ చేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న IT కంపెనీలపైనా ఈ ప్రభావం పడింది. ఢిల్లీలోనూ ఎయిర్‌పోర్టులో సర్వర్లు డౌన్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముంబై సహా మరికొన్ని ఎయిర్‌పోర్ట్‌లలోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మన దగ్గర ఆకాశ ఎయిర్‌లైన్స్, ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు సంస్థలు తాము సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ధృవీకరించాయి. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.