నిర్మలకు ముందు.. ఎవరెవరు బడ్జెట్ ను సమర్పించారు ?

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పిస్తున్న తొలి మహిళా మంత్రి కానున్నారు. అయితే ఇదివరకు గతంలో ఎవరెవరు బడ్జెట్లు సమర్పించారో ఓ లుక్కేద్దాం . మొట్టమొదటి బడ్జెట్ ను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 నవంబరు 26 న అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్.కె. షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడే బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇక మొరార్జీ దేశాయ్ అయితే ఏకంగా 10 […]

నిర్మలకు ముందు.. ఎవరెవరు బడ్జెట్ ను సమర్పించారు ?
Follow us

|

Updated on: Jul 04, 2019 | 2:06 PM

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పిస్తున్న తొలి మహిళా మంత్రి కానున్నారు. అయితే ఇదివరకు గతంలో ఎవరెవరు బడ్జెట్లు సమర్పించారో ఓ లుక్కేద్దాం . మొట్టమొదటి బడ్జెట్ ను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 నవంబరు 26 న అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్.కె. షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడే బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఇక మొరార్జీ దేశాయ్ అయితే ఏకంగా 10 సార్లు వీటిని ప్రవేశపెట్టి అత్యధిక బడ్జెట్లను ప్రతిపాదించిన వ్యక్తిగా ఫేమస్ అయ్యారు. ఒక వ్యక్తి ఇన్నిసార్లు ఇంట్రొడ్యూస్ చేయడం విశేషం. పి. చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. (మొరార్జీ దేశాయ్ తన జన్మ దినం రోజున రెండు సార్లు 1964 ఫిబ్రవరి 29 న, 1968 లోను బడ్జెట్ సమర్పించారు). ఇక 1999 వరకు కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి చివరి వర్కింగ్ డే నాడు సాయంత్రం 5 గంటలకు సమర్పిస్తూ వచ్చారు. బ్రిటీషర్ల కాలం నుంచి ఈ పధ్దతిని పాటించేవారు. ఎన్డీయే ప్రభుత్వంలో అప్పటి ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా దీన్ని మార్చి 1999 లో ఉదయం 11 గంటలకు మార్చారు. 2016 లో అప్పటి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1 న బడ్జెట్ సమర్పించారు. 2017 లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. ఇదిలా ఉండగా.బడ్జెట్ సీక్రెసీ ని మెయింటైన్ చేసేందుకు 2009 నుంచి ఆయా ప్రభుత్వాలు హల్వా సెరిమనీని పాటిస్తూ వస్తున్నాయి. పార్లమెంటుకు దీన్ని సమర్పించడానికి 10 రోజులముందు బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ మొదలవుతుంది. దీనికి అనుగుణంగానా అన్నట్టు ‘ హల్వా సెరిమనీ ‘ ని పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్ధిక శాఖ అధికారులకు, సిబ్బందికి హల్వాను పంచడం ఆనవాయితీగా మారింది. ఆర్ధికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టేవరకు వీరు నార్త్ బ్లాక్ కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది.