BSP Chief Mayawati: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాయావతి కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

BSP Chief Mayawati: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. తెలంగాణతో పాటు త్వరలో ఎన్నికలు జరగునున్న..

BSP Chief Mayawati: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాయావతి కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..
BSP Chief Mayavati
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 20, 2023 | 2:02 PM

BSP Chief Mayawati: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. తెలంగాణతో పాటు త్వరలో ఎన్నికలు జరగునున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ బీఎస్‌పీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగానే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు అధికారికంగా 26 పార్టీల I.N.D.I.A కూటమి ఏర్పాటు, అధికార బీజేపీ నేతృత్వంలోని 38 పార్టీల ఎన్‌డీఏ సమావేశాన్ని నిర్వహించిన ఒక రోజు తర్వాత.. బీఎస్‌పీ చీఫ్ మాయావతి తన పార్టీ ఏ పక్షంతోనూ కలిసి వెళ్లదని, రెండింటికీ దూరంగా ఉంటుందని, రానున్న ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తుందనన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విధమైన ప్రకటన చేశారు. అయితే హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందన్నారు.

ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ‘కులతత్వ, పెట్టుబడిదారీ’ పార్టీలతో పొత్తు పెట్టుకుందని ఆరోపిస్తూ, బీజేపీ ఎన్‌డీఏని బలపరుస్తోందని.. అయితే ‘వారి విధానాలు ముస్లిం, దళితులకు వ్యతిరేకం’మని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని 2014లో బీజేపీ హామీ ఇచ్చిందని, అది నేటీకి నెరవేర్చలేదని, కాంగ్రెస్ కూడా అంతేనని మాయావతి అన్నారు.

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని బీఎస్‌పీ పోటీ చేసింది. అప్పుడు బీఎస్‌పీ 19.43 శాతం ఓట్లతో పాటు 10 స్థానాలను కైవసం చేసుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది. 2022 UP అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్‌పీ 12.88 శాతం ఓట్లను పొంది, కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అంతకముందు జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ మొత్తం 403 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాల్లో మాత్రమే గెలుపొంది. అలాగే 81 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?