BSF: ఉగ్రవాదులకు ఇక చుక్కలే.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అత్యంత ఆధునిక టెక్నాలజీ..

సరిహద్దు పొడువునా హై టెక్నాలజీని ఉపయోగించేందుకు రెడీ అవుతోంది బీఎస్ఎఫ్. ఇందులో అత్యంత ఆధునిక టెక్నాలజీని కొనుగోలు చేసింది. దీంతో నిఘను పెంచుతోంది.

BSF: ఉగ్రవాదులకు ఇక చుక్కలే.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అత్యంత ఆధునిక టెక్నాలజీ..
BSF
Follow us

|

Updated on: Dec 01, 2022 | 12:38 PM

భారత సరిహద్దుల వెంబడి నిఘాను మరింత పెంచింది బీఎస్ఎఫ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కీలకమైన భారత సరిహద్దుల వెంబడి భద్రతా కార్యకలాపాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా BSF రెండు SUV-మౌంటెడ్ జామర్‌లు, 1400 హ్యాండ్‌హెల్డ్ థర్మల్ ఇమేజర్‌లు, దాదాపు 100 డ్రోన్‌లను కొనుగోలు చేసింది. ఈ వివరాలను ఓ సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి బుధవారం మీడియాకు వెల్లడించారు. సరిహద్దు భద్రతా దళం పాకిస్తాన్‌తో 2,289-కిమీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి..  పశ్చిమ బెంగాల్, అస్సాం సరిహద్దు వెంబడి (భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో భాగంగా) మొత్తం 635 సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్లుగా తెలిపారు.

ఉగ్రవాదుల ఎల్ఈడీ దాడుల నుంచి దళాలను రక్షించడానికి మహీంద్రా స్కార్పియో వాహనాల కొనుగులో చేస్తోంది. ఇందులో అమర్చేందుకు జామర్‌లను ఫోర్స్ కొనుగోలు చేసినట్లు అధికారి వెల్లడించారు.

BSF తన సరిహద్దు భద్రతా యూనిట్ల కోసం మొత్తం 1,424 హ్యాండ్-హెల్డ్ థర్మల్ ఇమేజర్‌లను (HHTIs) కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇచ్చిందని ఆయన చెప్పారు. రాత్రి సమయంలో పొగమంచు, వాతావరణంలో వచ్చే మార్పులతో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడానికి గాడ్జెట్ ఉపయోగించబడుతాయి.

సరిహద్దు ప్రాంతాలను చూడటం కోసం దాదాపు 100 చిన్న మరియు పెద్ద డ్రోన్‌లను ఫోర్స్ కొనుగోలు చేసింది. అలాంటి మరిన్ని డ్రోన్‌లు లేదా మానవరహిత వైమానిక వాహనాల కొనుగోలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం