MLC Kavitha Protest: హస్తినలో ఎమ్మెల్సీ కవిత దీక్ష.. సంఘీభావం తెలిపిన 18 పార్టీలు..
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత దీక్షను చేపట్టింది. కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు సీపీఐ, సీపీఎంతో పాటు..
BRS MLC Kavitha Protest: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత దీక్షను చేపట్టింది. కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు సీపీఐ, సీపీఎంతో పాటు.. ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, పీడీపీ, జేడీయూ, ఆర్జేడీ, అకాలీదళ్, ఆర్‌ఎల్డీ, JMM సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
కాగా, ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ప్రారంభించారు. ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది.
జంతర్‌మంతర్ దగ్గర ఎమ్మెల్సీ కవిత చేపట్టిన నిరాహార దీక్షను సాయంత్ర 4 గంటల తరువాత సీపీఐ కార్యదర్శి డి.రాజా విరమింపజేస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాడు. ఈ దీక్షలో బీఆర్ఎస్ నేతలు, మహిళా మంత్రులు, కార్యకర్తలతోపాటూ… 29 రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారు పాల్గొ్న్నారు. దాదాపు 5వేల మంది ఈ దీక్షలో భాగస్వామ్యం అయ్యారు.
కవిత చేపట్టిన దీక్షకు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (సంజయ్ సింగ్), అకాలీదళ్ (నరేష్ గుజ్రాల్), జేడీ(యూ) కేసీ త్యాగి, తృణమూల్ కాంగ్రెస్ (సుస్మిత దేవ్), ఆర్జేడీ, సమాజ్ వాది, సిపిఐ (డి. రాజా), సిపిఐ(ఎం) సీతారాం ఏచూరి, ఎన్సీపీ, శివ సేన (ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి ప్రియాంక చతుర్వేది), రాష్ట్రీయ లోక్‌దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా (మహువా మాజ్హి) , డీఎంకే, కపిల్ సిబల్ (స్వతంత్ర రాజ్యసభ సభ్యులు) లాంటి రాజకీయ నాయకులు, పార్టీలు పాల్గొన్నాయి.
కాగా, దీక్షలో తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా పలువురు బీఆర్ఎస్ మహిళా నేతలు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..