అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం లభ్యం..

ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్‌ వంతెనపై కారు పార్క్‌ చేసి ఉండటంతో ముంతాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు లైన్ అండ్ మెరైన్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్న ముంతాజ్ అలీ..

అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం లభ్యం..
Mumtaz Ali
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2024 | 6:25 PM

కర్ణాటకలోని మంగళూరు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం మంగళూరులో లభ్యమైంది. సోమవారం ఉదయం కుల్లూరు వంతెన సమీపంలోని ఫల్గుణి నదిలో మృతదేహాన్ని వెలికితీశారు. షిరూర్ విపత్తులో మరణించిన అర్జున్ కోసం అన్వేషణలో పాల్గొన్న డైవర్ ఈశ్వర్ మల్పేతో సహా రెస్క్యూటీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం ముంతాజ్‌ అలీ కోసం ఫాల్గుణి నదిలో గాలించగా మృతదేహాం లభించింది. ముంతాజ్‌ అలీ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ఆదివారం ఉదయం కుళ్లూరు వంతెన సమీపంలో దెబ్బతిని కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున కారులో ఇంటి నుంచి బయలుదేరిన అలీ తిరిగి రాకపోవడం, ఉదయం కులూర్‌ వంతెనపై కారు పార్క్‌ చేసి ఉండటంతో ముంతాజ్‌ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళూరు లైన్ అండ్ మెరైన్ ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్న ముంతాజ్ అలీ ఆదివారం (అక్టోబర్ 6) తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌కు వాయిస్ మెసేజ్ పంపారు. అతని కుమార్తె 4:40 AM సమయంలో ఆ మెసేజ్‌ చూశారు. వెంటనే అతనికి కాల్‌ చేయగా సమాధానం రాలేదని తెలిసింది. అతని కోసం గాలించిగా, అతని కారు కులూర్ వంతెన వద్ద గుర్తించారు. అయితే, అలీ ఆ కారులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం తెల్లవారుజామున అదృశ్యమైన వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) మృతదేహం కూలూర్ వంతెన సమీపంలోని ఫల్గుణి నదిలో సోమవారం ఉదయం లభ్యమైంది. మృతదేహాన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 52 ఏళ్ల ముంతాజ్ అలీ మంగళూరు నార్త్ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు. ముంతాజ్ అలీని కొందరు బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. ముంతాజ్ అలీ మృతికి కారణంగా ఆరోపిస్తూ  ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. అతడి నుంచి ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..