డెలివరీ బాయ్‌గా జొమాటో సీఈవో..కానీ ఊహించని షాక్..!
గురుగ్రామ్‌లోని ఓ మాల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఫుడ్ ఆర్డర్ తీసుకుంటుండగా లిఫ్టును ఉపయోగించకుండా ఆపిందని జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఆదివారం ఆరోపించారు.మిస్టర్ గోయల్, తన భార్య గ్రీసియా మునోజ్‌తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు.
గురుగ్రామ్‌లోని ఓ మాల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఫుడ్ ఆర్డర్ తీసుకుంటుండగా లిఫ్టును ఉపయోగించకుండా సెక్యూరిటీ ఆపిందని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఆదివారం ఆరోపించారు. గోయల్, తన భార్య గ్రీసియా మునోజ్‌తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. డెలివరీ బాయ్స్ సవాళ్లను ప్రత్యక్షంగా అనుభవించడానికి, ఆర్డర్‌ను సేకరించేందుకు యాంబియన్స్ మాల్‌కి వెళ్లినప్పుడు మెట్లు ఎక్కమని సెక్యూరిటీ చెప్పారని పేర్కొన్నాడు.
“తన రెండవ ఆర్డర్ సమయంలో, డెలివరీ బాయ్‌ల పని పరిస్థితులను మెరుగుపరచడానికి తాము మాల్స్‌తో మరింత సన్నిహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు. మాల్స్ కూడా డెలివరీ భాగస్వాములతో మరింత మానవత్వంతో ఉండాలని కోరారు. ట్వీట్‌తో పాటు వీడియోను Xలో పోస్ట్ చేసాడు. అతని పోస్ట్‌కు పలువురు రియాక్ట్ అయ్యారు.
చాలా మంది డెలివరీ బాయ్‌లకు కేవలం మాల్స్‌లో మాత్రమే కాకుండా వివిధ సొసైటీలు కూడా మెయిన్ లిఫ్ట్‌లో అనుమతించడం లేదని పేర్కొన్నారు. ప్రతీ సొసైటీ, మాల్, కార్యాలయంలో డెలివరీ బాయ్‌లకు లిఫ్టులు ఉపయోగించడం తప్పనిసరి చేయాలని, ఎటువంటి విభజన ఉండకూడదని పలువురు కోరుతున్నారు.
జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ పెట్టిన ట్వీట్:
Ambience Mall has already responded to the situation, and created a comfortable online food delivery pick up point for all delivery partners. Thanks Arjun (owner of Ambience) for noticing my post and taking quick action. He’s also agreed to let us deploy some “walkers” inside the… https://t.co/3aWlZzMADd
— Deepinder Goyal (@deepigoyal) October 7, 2024