Black Fungus: దేశంలో మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం.. థర్డ్ వేవ్‌లో యూపీలో తొలి కేసు..

Covid-19 Third Wave: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ నమోదు కాని కేసులు థర్డ్‌వేవ్‌ (Third Wave) లో నమోదవుతున్నాయి. నిత్యం రెండు లక్షలకు

Black Fungus: దేశంలో మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం.. థర్డ్ వేవ్‌లో యూపీలో తొలి కేసు..
Black Fungus
Follow us

|

Updated on: Jan 19, 2022 | 7:29 AM

Covid-19 Third Wave: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ నమోదు కాని కేసులు థర్డ్‌వేవ్‌ (Third Wave) లో నమోదవుతున్నాయి. నిత్యం రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం విస్తరిస్తోంది. దీంతో అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భయాందోళనల మధ్య గతేడాది సెకండ్‌ వేవ్‌లో వణుకుపుట్టించిన బ్లాక్‌ ఫంగస్ మళ్ళీ పంజా విసిరడం ప్రారంభించింది. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌ (Black Fungus) తో ఆసుపత్రిలో చేరాడు. బ్లాక్‌ ఫంగస్‌ అతని కన్ను, ముక్కుకు వ్యాపించినట్లు వైద్య అధికారులు తెలిపారు. కరోనా థర్డ్‌ వేవ్‌లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 45 ఏళ్ళ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని వైద్యవర్గాలు తెలిపాయి.

ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి షుగర్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని బ్లాక్‌ ఫంగస్‌ వార్డులో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు కాన్పూర్ జీఎస్‌వీఎమ్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కలా తెలిపారు. ఇతను కాన్పూర్ లోని కాంట్ నివాసి అని తెలిపారు. సదరు వ్యక్తికి కరోనా సోకిందని.. ఆతర్వాత బ్లాక్ ఫంగస్ వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అతని మధుమేహం సమస్య ఉందని తెలిపారు. ప్రస్తుతం అతని చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

సెకండ్‌ వేవ్‌ సమయంలో బ్లాక్‌ ఫంగస్‌ భారీగా సోకింది. ఫంగస్‌ కారణంగా పలువురు కంటి చూపును సైతం కోల్పోయిన విషయం విధితమే. మరోసారి కేసులు నమోదవుతుండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

Also Read:

Diabetes Care: బాడీలో షుగర్ లెవల్ భారీగా పెరుగుతుందా..? అయితే ఈ ఐదు పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి

Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువుకు తీవ్ర ప్రమాదం..