Black Fungus: కరోనా రోగులపై బ్లాక్ ఫంగస్ పంజా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు మృతి..
COVID-19 patients: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఓ వైపు మహమ్మారి
COVID-19 patients: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఓ వైపు మహమ్మారి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడక్కడా వెలుగులోకి బ్లాక్ ఫంగస్ కేసులతో అంతటా భయం నెలకొంది. ఈ తరుణంలోనే మధ్యప్రదేశ్‌లో తాజాగా బ్లాక్ ఫంగస్ పంజా విసిరింది. బ్లాక్ ఫంగస్ లేక మ్యూకర్‌మైకోసిస్ వల్ల ఐదుగురు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. ఎంపీ ఇండోర్‌లోని మహారాజ యశ్వంత్‌రావు ఆసుపత్రిలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ మేరకు మహారాజ యశ్వంత్‌రావు ఆసుపత్రి వైద్యులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసుపత్రిలో ఉదయం వరకూ ఉన్న ఇలాంటి పేషెంట్ల సంఖ్య 67కి చేరుకుందని అధికారులు తెలిపారు. ఇంకా ఇండోర్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు.. కర్ణాటక, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నమోదయ్యాయి. ఈ ఇన్ఫెక్షన్ కేసులు కూడా పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: