నాగపూర్ లో ‘ నల్ల ఫంగస్ బీభత్సం’ ! 48 గంటల్లో 17 మంది రోగుల మృతి….పెరుగుతున్న కేసులు……డాక్టర్ల అయోమయం…

మహారాష్ట్ర లోని నాగపూర్ లో బ్లాక్ ఫంగస్ 'కరాళ నృత్యం' చేస్తోంది. గత 48 గంటల్లో దీని కారణంగా 17 మంది మృతి చెందగా కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి.

నాగపూర్ లో ' నల్ల ఫంగస్ బీభత్సం' ! 48 గంటల్లో 17 మంది రోగుల  మృతి....పెరుగుతున్న కేసులు......డాక్టర్ల అయోమయం...
Black Fungus
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 02, 2021 | 2:18 PM

మహారాష్ట్ర లోని నాగపూర్ లో బ్లాక్ ఫంగస్ ‘కరాళ నృత్యం’ చేస్తోంది. గత 48 గంటల్లో దీని కారణంగా 17 మంది మృతి చెందగా కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. విదర్భ లోని ఆరు జిల్లాల్లో మొత్తం 108 మంది రోగులు మరణించగా ఒక్క నాగపూర్ లోనే 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఈ డివిజన్ లో 1325 నల్ల ఫంగస్ కేసులు నమోదు కాగా ఈ జిల్లా లోనే 1122 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. 900 మందికి పైగా పేషంట్స్ సర్జరీ చేయించుకున్నారని, వీరిలో 839 మంది నాగపూర్ వాసులేనని వారు చెప్పారు. అయితే ఇదే సమయంలో 566 మంది కోలుకున్నట్టు వారు తెలిపారు. ఈ వ్యాధి చికిత్సలో వాడే యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ల కొరత మహారాష్ట్రలో తీవ్రంగా ఉంది. ఓ వైపు బ్లాక్ ఫంగస్ కేసుల పెరుగుదల, మరోవైపు ఈ మెడిసిన్ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి రాజేంద్ర షింగానే తెలిపారు . రాష్ట్రానికి ప్రస్తుతానికి 20 వేల యాంఫోటెరిసిన్-బీ వైల్స్ అవసరం కాగా కేంద్రం 5.900 వైల్స్ మాత్రమే కేటాయించిందని ఆయన చెప్పారు.

నాగపూర్ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం పట్ల డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సలు చేస్తున్నప్పటికీ వారు మృతి చెందుతున్నారని అన్నారు. ఇలా ఉండగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే.. కూడా దీనిపై వ్యాఖ్యానిస్తూ.. స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నందున ఈ కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల పరిమితంగా స్టెరాయిడ్స్ వాడిన ఫలితంగా కలిగే ప్రయోజనాలు ఉన్నాయా అన్న విషయాన్ని నిపుణులు తేల్చాలని అన్నారు. కోలుకున్న కోవిద్ రోగులకు ఈ బ్లాక్ ఫంగస్ సోకడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: TSRJC CET: తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. టీఎస్ ఆర్‌జేసీ సెట్ ర‌ద్దు

PRESSURE ON CHINA: చైనాపై పెరుగుతున్న ఒత్తిడి.. వైరస్ మూలాలను, వూహన్ ల్యాబును అప్పగించాలంటున్న వెస్టర్న్ మీడియా