Black Fungus: ఝార్ఖండ్ లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…..26 మంది మృతి… కర్ణాటకలోనూ ఉధృతి

చిన్న రాష్ట్రమైన ఝార్ఖండ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 79 కేసులు నమోదు కాగా-మరో 53 అనుమానిత కేసులని, 26 మంది రోగులు మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Black Fungus: ఝార్ఖండ్ లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు.....26 మంది మృతి... కర్ణాటకలోనూ   ఉధృతి
Black Fungus Cases Spike In
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 19, 2021 | 10:46 PM

చిన్న రాష్ట్రమైన ఝార్ఖండ్ లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 79 కేసులు నమోదు కాగా-మరో 53 అనుమానిత కేసులని, 26 మంది రోగులు మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 24 జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్టు ఇవి పేర్కొన్నాయి. అయితే 50 మంది రోగులు కోలుకున్నట్టు ఝార్ఖండ్ నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ రవిశంకర్ శుక్లా తెలిపారు. సీఎం హేమంత్ సొరేన్.. ఈ నెల 15 న బ్లాక్ ఫంగస్ ని ఎపిడెమిక్ డిసీజ్ గా ప్రకటించారని ఆయన చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ రికార్డులను మెయిన్ టైన్ చేయాలనీ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్న్ ప్రోగ్రాం అథారిటీనని కోరిందని, అలాగే ఈ వ్యాధికి సంబంధించి పరిస్థితిపై విజిలెన్స్ పెట్టాలని సివిల్ సర్జన్స్ ని కోరామని ఆయన చెప్పారు. కాగా-రాంచీలో అత్యధికంగా ఈ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ నగరంలో 46 కేసులు నమోదయ్యాయి. వీటిలో 29 కేసులను ధృవీకరించారు. 17 కేసులను అనుమానిత కేసులుగా పరిగణించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాంచీలో గత 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందారు.

ఇక కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల జోరు పెరిగింది. ఈ రాష్ట్రంలో 2,856 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 225 మంది రోగులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో వివిధ హాస్పిటల్స్ లో 2,316 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అటు=ఈ రోగులకు ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాలను నియమించారు. వీరికి వార్డులను కూడా వేరుగా నిర్దేశించారు. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సలో వాడే మందులకు కొరత లేదని కేంద్రం వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Spiders: ఆస్ట్రేలియాలో అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి.. వెండిలా మెరుస్తున్న సాలీళ్ల వలలు..

TS Cabinet Meeting Live: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్‌.. లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు