SBI Alert: కస్టమర్లకు ఎస్‌బిఐ కీలక సూచన.. ఇబ్బంది పడొద్దంటే అది చేయాల్సిందేనంటూ..
SBI Alert: ఎస్‌బిఐ తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎస్‌బిఐ.. కస్టమర్లు తప్పనిసరిగా తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్...

SBI Alert: ఎస్‌బిఐ తన కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎస్‌బిఐ.. కస్టమర్లు తప్పనిసరిగా తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అభ్యర్థించింది. ఎలాంటి అవాంతరాలు లేని సర్వీస్ పొందాలనుకుంటే.. వినియోగదారులు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది. ‘‘మా కస్టమర్లకు మేమిస్తున్న సలహా.. అవాంతరాలు లేని, అసౌకర్యానికి గురికాని బ్యాంకింగ్ సేవలు పొందాలంటే మీ పాన్ కార్డ్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి.’’ అని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది. అంతేకాదు.. ‘‘పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి. లింక్ చేయకపోతే, పాన్ పనిచేయని/ క్రియారహితంగా ఉంటుంది. అలాగే లావేదేవీలను నిర్వహించడం కష్టతరం అవుతుంది.’’ అని పేర్కొంది.
పాన్-ఆధార్ లింక్ ఎలా చేయాలో కూడా ఎస్‌బిఐ సదరు ట్వీట్‌లో పేర్కొంది. ఆధార్-పాన్ లింక్ కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక సైట్‌లోకి వెళ్లాలని, ‘లింక్ ఆధార్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని పేర్కొంది. ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసిన సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా పాన్-ఆధార్‌ను లింక్ చేసుకోవాలని సూచించింది. కాగా, పాన్-ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30వ తేదీనే కావడంతో ఎస్‌బిఐ తన కస్టమర్లను ఇలా అలర్ట్ చేసింది.
SBI Tweet:
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/N249107lZJ
— State Bank of India (@TheOfficialSBI) June 19, 2021
Also read: