Spiders: ఆస్ట్రేలియాలో అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి.. వెండిలా మెరుస్తున్న సాలీళ్ల వలలు..

Spiders: ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి ఒకటి వెలుగు చూసింది. ఆ సాలీళ్ల వలలు చూడటానికి వెండిలా..

Spiders: ఆస్ట్రేలియాలో అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి.. వెండిలా మెరుస్తున్న సాలీళ్ల వలలు..
Spider
Follow us

|

Updated on: Jun 19, 2021 | 10:35 PM

Spiders: ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అతి పొడవైన సాలెగూళ్ల దుప్పటి ఒకటి వెలుగు చూసింది. ఆ సాలీళ్ల వలలు చూడటానికి వెండిలా మెరుస్తున్నాయి. వింతగా అనిపించినప్పటికీ ఇది నిజంగా నిజం. ఆస్ట్రేలియాలో ఇటీవల భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే వరదల నుంచి తప్పించుకోవడానికి సాలీళ్లు పొడవైన గూళ్లను అల్లుకున్నాయి. వాటిని రక్షణ కవచాళ్లా ఉపయోగించుకున్నాయి సాలీళ్లు. వరదలు వచ్చినా కొట్టుకుపోకుండా ఉండేందుకు బెలూన్ల మాదిరిగా గూళ్లను అల్లుకున్నాయి. అయితే, విక్టోరియా గిప్స్‌లాండ్ ప్రాంతంలో వరదలతో దుప్పటిలా పరుచుకున్న పాలెగూళ్లు బయటపడ్డాయి. వాటి సాయంతో లక్షల కొద్ది సాలీళ్లు బయటపడ్డాయని పరిశోధకులు అంటున్నారు.

వరదలతో లక్షల కొద్ది సాలీళ్లు చెట్లపైకి చేరాయని విక్టోరియా మ్యూజియమ్స్ క్యూరేటర్ డాక్టర్ కెన్ వాకర్ వెల్లడించారు. ఈ సాలె గూళ్ల వల గాలికి అలల మాదిరి కదులుతుండటంతో సాలీళ్లు వేగంగా కదిలి చెట్ల పైకి చేరడానికి అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర సాలెగూళ్లు విస్తరించి ఉన్నాయి. సాలీళ్లు భూమిపై నుంచి వేగంగా తప్పించుకుని చెట్లపైకి చేరడానికి దుప్పటి వలె పరుచుకున్న వల ఉపయోగపడిందని డాక్టర్ కెన్ వారన్ తెలిపారు. వరద సమస్యలే కాకుండా.. పెరుగుతున్న సాలీల్ల సంఖ్య మూలంగా ఆహారం కోసం వాటి మధ్య పోటీ ఏర్పడిందని, సాలీళ్లు ఇతర ప్రాంతాలకు వేగంగా వెళ్లడానికి ఈ పొడవైన వలలను మార్గంగా నిర్మించుకున్నాయని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా పలు విషపు సాలీళ్లకు నిలయం.. ఇదిలాఉంటే.. ఆస్ట్రేలియాలో అనేక రకాల విషపు సాలీళ్లు ఉన్నాయి. అందుకే ఆస్ట్రేలియాను పలు విషపు సాలీళ్లకు నిలయంగా పేర్కొంటారు. భూగోళంలోని అత్యంత విషపూరితమైన సాలీళ్లలో 8 జాతులు ఆస్ట్రేలియాలో ఉన్నాయని వెల్లడైంది. కొన్ని సాలీళ్లు కరిస్తే 15 నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందట. అయితే, విషపు సాలీళ్ల నేపథ్యంలో 1981లోనే సాలీళ్ల విషానికి విరుగుడు మందు అందుబాటులోకి వచ్చింది. ఇక.. మార్చి, ఏప్రిల్ నెలలో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో వేలకొద్దీ విషపు సాలీళ్లు నివాస గృహాలపై దాడి చేశఆయి. వరదల కారణంగా 40 వేలకు పైగా జనాలు తమ గృహాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెల్లారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. వరదల అనంతరం తిరిగి వచ్చి చూసేసరికి గృహాలు, షెడ్లలో వేలకొద్ది సాలీళ్లు తిష్టవేసుకుని కూర్చున్నాయి. వరదల మూలంగా సాలీళ్లు నివాస గృహాల్లోకి వచ్చాయని పరిశోధకులు చెబుతున్నారు.

Also read:

Chiru : నా పొలిటికల్ లైఫ్ లో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి, అంత దార్శినికుడ్ని చూడలేదు : చిరంజీవి

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..