AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేస్తున్న యజమాని.. అది నచ్చని కుక్క ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరంతే..

Viral Video: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో బంధీలు అయిపోయారు. 2020లో దేశంలో కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి...

Viral Video: వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీ చేస్తున్న యజమాని.. అది నచ్చని కుక్క ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరంతే..
Dog
Shiva Prajapati
|

Updated on: Jun 19, 2021 | 5:53 PM

Share

Viral Video: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో బంధీలు అయిపోయారు. 2020లో దేశంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రజలు ఎన్నడూ లేని కొత్త జీవనాన్ని గడపాల్సి వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తినేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో ఉద్యోగులు ఇంట్లో ఉండే పనులు చక్కబెడుతున్నారు. అయితే, వర్క్ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా ఓ వ్యక్తి డ్యూటీ చేస్తుండగా.. అది నచ్చని పెంపుడు కుక్క అతనికి అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కచ్చితంగా కడపుబ్బా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పెంపుడు కుక్కలను యజమానులు ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమలో ఒకరిగా.. తమ కుటుంబ సభ్యుడిగా పెంపుడు కుక్కలను ఆదిరస్తూ దాని ఆలనా పాలనా చూసుకుంటారు. ఆ కుక్కలు అంతే ప్రేమను యజమానుల పట్ల ప్రదర్శిస్తాయి. వారికి ఏ ఆపద వచ్చినా.. వారికి ఏ అవసరం వచ్చినా.. అండగా ఉంటాయి. చాలా కుక్కలు తమ యజమానులతో ఆడుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటాయి. వారితో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం బిజీ యుగంలో అది కొంచె కష్టసాధ్యంగా ఉంది.

ఇక అసలే కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా మంది ఇంట్లో ఉండే పనులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఇంట్లోనే ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాడు. వారికి ఒక పెంపుడు కుక్క ఉంది. తన యజమాని పని చేయడం ఇష్టం లేని ఆ కుక్క.. అతను ల్యాప్‌టాప్‌ ఓపెన్ చేయనివ్వకుండా అడ్డుకుంది. అతని ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి.. ఆ కుక్క దానిని మూసివేస్తుంది. అలా కాసేపు సరదాగా ఆ కుక్క తన యజమానిని ఆటపట్టించింది. అయితే, ఈ ఘటన అంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 60 వేల మందికి పైగా చూశారు. నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

No Mask Countries: కొన్ని దేశాల్లో మాస్కులకు గుడ్ బై.. ‘ఆ’ అయిదు దేశాలేవంటే?

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ