Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: జోరు వర్షంలో ఆన్‌లైన్‌ క్లాస్‌ వింటున్న కూతురు.. గొడుగు పట్టుకుని అండగా నిలిచిన తండ్రి..

Viral Pic: సాంకేతిక అభివృద్ధి చెందని కాలంలో అంటే.. మన తండ్రులు, తాతల బాల్యంలో మన దేశంలో విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు.

Viral Pic: జోరు వర్షంలో ఆన్‌లైన్‌ క్లాస్‌ వింటున్న కూతురు.. గొడుగు పట్టుకుని అండగా నిలిచిన తండ్రి..
Student
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 19, 2021 | 10:13 PM

Viral Pic: సాంకేతిక అభివృద్ధి చెందని కాలంలో అంటే.. మన తండ్రులు, తాతల బాల్యంలో మన దేశంలో విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా మంది కందెన దీపాల కింద జీవనం సాగించారు. వాటి వెలుగుల మధ్యే చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. చదువు మీద ఉన్న ప్రేమ, ఆసక్తి కొద్ది అనేక కష్టనష్టాలకోర్చి ఉన్నత చదువులు చదవి గొప్పవ్యక్తులుగా ప్రసిద్ధి చెందారు. అలాంటి వారు ప్రస్తుతం కూడా చాలా మందే ఉన్నారని చెప్పుకోవాలి. ఒక్క విద్యుత్ మాత్రమే కాదు.. చదువుకోవడానికి సరైన ఆశ్రయం ఉండేది కాదు. చెట్ల కింద, గుడెసెలలో కూర్చుని చదువుకునేవారు.

ఇదిలాఉంటే. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో.. భారీ వర్షంలో ఓ విద్యార్థిని ఆన్ లైన్ క్లాసులు వింటుండగా అతని తండ్రి పక్కన నిల్చొని గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని కొందరు తమ కెమెరాలో బందించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ ఫోటోకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకా బాలక్క గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు గ్రామ శివారులోని ఓ ఖాళీ ప్రాంతానికి వచ్చింది. అయితే గత కొద్దీ రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ విద్యార్థిని వర్షంలోనే క్లాస్ వినాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న ఆమె తండ్రి.. కూతురు క్లాసులు వింటుండగా గొడుగు పట్టుకొని సాయంగా నిల్చున్నాడు. దాదాపు రెండు గంటల పాటు ఆ తండ్రి తన కూతురు మీద వర్షం నీరు పడకుండా గొడుగు పట్టుకోవడం నెటిజన్ల హృదయాలను ద్రవింపజేసింది.

కాగా, ఈ విషయంపై సదరు విద్యార్థిని స్పందించింది. తమ గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నారని.. సరిగా సిగ్నల్స్‌ లేకపోవడంతో గ్రామ శివారుకు వచ్చి క్లాసులు వింటున్నామని తెలిపింది. తాను డిగ్రీ చదువుతున్నానని, వర్షంలో తడుస్తుండటంతో తన తండ్రి గొడుగు పట్టుకొని నిల్చున్నట్లు వివరించింది. ఆన్ లైన్ క్లాసులు మొదలైనప్పటి నుంచి తాను ఇలా ఊరి బయటకు వచ్చే వింటున్నాని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం 9 గంటలకు గ్రామ శివారు ప్రాంతాలకు వస్తే మళ్లీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వెళ్తామని చెప్పింది. తమ గ్రామానికి సిగ్నల్స్‌ వచ్చే విధంగా చూడాలని ఆమె అధికారులను, ప్రభుత్వాన్ని కోరింది. తనలాంటి వారు చాలామంది ఇలా వర్షంలో ఆన్ లైన్ క్లాసులు వింటున్నారని కూడా చెప్పింది.

Also read:

Suicide for Cell Phone: సెల్‌ఫోన్ విషయంలో అక్కా-తమ్ముడి మధ్య గొడవ.. మనస్తాపంతో ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య!