కోవిద్ తరుణంలో ప్రజలకు అండగా మా కార్యకర్తలు,.. మరి మీరు..? విపక్షాలపై విరుచుకుపడిన బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా

ఈ కోవిద్ తరుణంలో తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉన్నారని, వారిని ఆదుకుంటున్నారని కానీ ప్రతిపక్షాలు వర్చ్యువల్ గా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కనిపిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పీ. నడ్డా ఆరోపించారు.

కోవిద్ తరుణంలో ప్రజలకు అండగా మా  కార్యకర్తలు,.. మరి మీరు..? విపక్షాలపై  విరుచుకుపడిన  బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా

ఈ కోవిద్ తరుణంలో తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉన్నారని, వారిని ఆదుకుంటున్నారని కానీ ప్రతిపక్షాలు వర్చ్యువల్ గా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కనిపిస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు జె.పీ. నడ్డా ఆరోపించారు. కోవిద్ పేరిట మీరంతా క్వారంటైన్ లో ఉంటే మా వాళ్ళు కోవిద్ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు లక్ష గ్రామాలు, పల్లెల్లో బాధితులకు అన్నివిధాలుగా సాయం చేస్తున్నారని, ఆయన చెప్పారు. కోవిద్ పై పోరులో కేంద్ర ప్రభుత్వ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసే విధంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని నడ్డా ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ ‘మోదీ వ్యాక్సిన్’ అంటూ ఎద్దేవా చేశారని, ఇప్పుడు వ్యాక్సిన్ల కోసం తహతహలాడుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అయిన సందర్బంగా తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కనీసం రెండేసి గ్రామాల్లో ప్రజలకు సేవ చేస్తారని, ఈ రోజును సేవా దివస్ గా పాటిస్తున్నామని అయన వివరించారు.

కోవిద్ టీకామందు ఉత్పత్తికి ప్రభుత్వం 13 కంపెనీలకు అనుమతినిచ్చిందని, త్వరలో మరో 19 కంపెనీలకు కూడా అనుమతినివ్వబోతున్నామని ఆయన చెప్పారు. భారత్ బయో టెక్ సంస్థ వచ్చే అక్టోబరు నాటికీ నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారీని ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత తాత్కాలికమే అని ఆయన పేర్కొన్నారు. పలు విదేశీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో మనకు తగినంత టీకామందు అందుబాటులో ఉంటుందని నడ్డా వెల్లడించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో )
Manchu Vishnu: కూతుళ్లు ఛాలెంజ్ తో మోహన్ బాబు కి షాక్ ఇచ్చిన మంచు విష్ణు… ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu