జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. .కేంద్రం.. టీకామందుల లభ్యతలో కొరత ఉండబోదని భరోసా
వచ్చే జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రయారిటీ గ్రూపులకు 6.9 కోట్ల డోసుల టీకామందులను...
వచ్చే జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని ప్రయారిటీ గ్రూపులకు 6.9 కోట్ల డోసుల టీకామందులను అందజేస్తామని వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికీ ఈ టీకామందులు వేస్తారని, ఇది పూర్తిగా ఉచితమని స్పష్టం చేసింది. ఆ తరువాత రాష్టాలతో బాటు ప్రైవేటు ఆస్పత్రులకు 5.86 కోట్ల డోసుల వ్యాక్సిన్ లభ్యమవుతుందని, అడ్వాన్సుగా ఈ కేటాయింపు ఉంటుందని వివరించింది. వ్యాక్సిన్ వృధా కాకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కోరింది. లోగడ పంజాబ్, తమిళనాడు, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాలు వ్యాక్సిన్ ని వృధా చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా-మే నెలలో 7,94,05 200 డోసుల టీకామందులను ఏఈ కార్యక్రమం కోసం నిర్దేశించినట్టు కేంద్ర తెలిపింది. ఇప్పటివరకు ఇండియాలో 21.20 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అటు గత 24 గంటల్లో దేశంలో 1.65 లక్షల కోవిద్ లేసులు నమోదు కాగా 3,460 మంది రోగులు మృతి చెందారు. ఇండియాలో 21,14,50 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ రేటు చాలావరకు పెరిగినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక వ్యాక్సిన్ కొరత నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. త్వరలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోసం సంబంధిత కంపెనీతో చర్చలు జరుగుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇండియాలో తమ టీకామందు పంపిణీకి ఆ సంస్థ కూడా చొరవ చూపుతోందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని చదవండి ఇక్కడ : Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో ) Manchu Vishnu: కూతుళ్లు ఛాలెంజ్ తో మోహన్ బాబు కి షాక్ ఇచ్చిన మంచు విష్ణు… ( వీడియో )