AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi Temple: ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్త.. పీఎంవో అభ్యంతరాలతో రాత్రికి రాత్రే తొలగింపు

Modi Temple: రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు దేవాలయాలు కట్టించడం ఇటీవల ఓ ట్రెండ్‌లా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్రమోదీకి...

Modi Temple: ప్రధాని మోడీకి గుడికట్టిన బీజేపీ కార్యకర్త.. పీఎంవో అభ్యంతరాలతో రాత్రికి రాత్రే తొలగింపు
Modi Temple In Pune
Narender Vaitla
|

Updated on: Aug 19, 2021 | 4:05 PM

Share

Modi Temple: రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు దేవాలయాలు కట్టించడం ఇటీవల ఓ ట్రెండ్‌లా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్రమోదీకి గుడిని నిర్మించి.. అందులో మోడీ విగ్రహాన్ని ప్రతిష్టాంచారు. పుణెకు చెందిన 37 ఏళ్ల మయూర్‌ ముండే అనే కార్యకర్త.. మోడీకి విరాభిమాని. ఈ క్రమంలోనే మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఏకంగా రూ. 1,60,000 ఖర్చుతో దేవాలయాన్ని నిర్మించాడు. ఇందు కోసం మయూర్‌ జైపూర్‌ మార్బల్‌ను ఉపయోగించాడు. మోడీకి ఆలయాన్ని నిర్మించడంపై మయూర్‌ మాట్లాడుతూ.. ‘ఆయోధ్యలో రాముడికి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తికి ఓ దేవాలయం ఉండాలనేది నా భావన. అందుకోసమే నేనున్న ప్రదేశంలో మోదీకి ఆలయాన్ని నిర్మించాను’అని చెప్పుకొచ్చాడు.

Modi

రాత్రికి రాత్రే విగ్రహం తొలగింపు..

అయితే తన అభిమాన్ని చాటుకునే క్రమంలో మయూర్‌ ఆలయాన్ని నిర్మించాడు బాగానే ఉంది. కానీ ఆ ఆలయంలో మోదీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించారు. ఈ పని చేసింది ప్రతిపక్షాలో, మోడీ అంటే గిట్టని వారో అనుకుంటే పొరపాటే. బీజేపీ అధిష్టానం మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. మోదీ ఆలయానికి సంబంధించిన వార్త మీడియాలో రావడంతో ఈ విషయం ప్రధాన మంత్రి కార్యాలయం దృష్టికి వెళ్లింది. అధికారుల సూచన మేరకు బుధవారం రాత్రి విగ్రహాన్ని తొలగించారు. దీంతో గురువారం అటుగా వెళ్లిన వారు నరేంద్ర మోదీ విగ్రహం తొలగించడాన్ని గుర్తించారు. తొలగించిన విగ్రహాన్ని అక్కడే నివాసం ఉంటున్న బీజేపీ కౌన్సిలర్‌ ఇంటికి తరలించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొదట్లో పుణేలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహ అంశం ఎన్నికల సమయంలో చర్చకు దారి తీస్తుందన్న కారణంతోనే బీజేపీ హైకమాండ్‌ విగ్రహాన్ని తొలతించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

Modi Temple

విగ్రహం తొలగింపుపై నిరాశ వ్యక్తం చేసిన ఎన్‌సీపీ..

ఇదిలా ఉంటే మోదీ విగ్రహం తొలగింపుపై ఎన్‌సీపీ పార్టీ నాయకులు తమదైన శైలిలో చలోక్తులు విసిరారు. మోడీ విగ్రహాన్ని తొలగించడంపై తీవ్ర నిరాశకు గురయ్యామని ఎన్‌సీపీ అధ్యక్షులు ప్రశాంత్‌ జగ్‌పత్‌ మాట్లాడుతూ.. ‘రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఆహార పదార్థాల ధరలను తగ్గించమని మోదీ విగ్రహానికి వేడుకుందామని అనుకున్నాం. కానీ విగ్రహాన్ని తొలగించడంతో తీవ్రంగా నిరాశ పడ్డాం. అంతేకాకుండా పెరుగుతోన్న నిరుద్యోగాన్ని కట్టడి చేయమని పూజలు చేద్దామనుకున్నాం’ అంటూ ఛలోక్తులు విసిరారు.

Also Read: Vijayawada: రాహుల్ మిస్టరీ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. కారులో కీలక ఆధారాలు లభ్యం.. డ్రైవర్ సీట్‌లో

Cyber Crime: సైబర్ నేరాల ఫిర్యాదుకు ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!

Viral Video: తిరగబడిన అడవి దుప్పి.. చిరుతకు చుక్కలు చూపించింది.. వీడియో చూస్తే షాకే..