Cyber Crime: సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!

సైబర్ నేరాలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు ప్రత్యేక

Cyber Crime: సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!
Cyber Crime
Follow us

|

Updated on: Aug 19, 2021 | 3:50 PM

Cyber Crimes: సైబర్ నేరాలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసేలా ప్రత్యేక ఆన్లైన్ వ్యవస్థ రూపొందించారు. విజయవాడ పోలీసు వాట్సాప్ నంబర్ నెంబర్‌కు కానీ సైబర్ పోలీసింగ్ సెల్ విజయవాడ జి మెయిల్ కి గాని వెంటనే ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పై వెసులుబాటుతోపాటు, సైబర్ మిత్ర హెల్ప్లైన్ నెంబర్‌కు కూడా బాధితులు ఎక్కడి నుండైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 15 5260 కి ఫిర్యాదు చేసిన వెంటనే డిజిటల్ ఎకో సిస్టం నుంచి బయటకు వెళ్ళక ముందే నగదు వెనక్కు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ సి పి శ్రీనివాసులు టీవీ9కు వెల్లడించారు.

కాగా, దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు సైబర్‌ నేరాల కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. నిందితులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా లక్కీడ్రాలో విలువైన కారు గెలుపొందారంటూ సైబర్‌ నేరగాళ్లు రూ.17.35 మోసం చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని గోల్కొండలో చోటుచేసుకుంది. లక్కీడ్రాలో ఎక్స్‌యూవీ కారు వచ్చిందని నమ్మించిన సైబర్‌ మోసగాళ్లు అతని నుంచి రూ. 17.35 లక్షలు కాజేశారు.

వివరాల్లోకి వెళితే, గోల్కొండ ప్రాంతానికి చెందిన ముజాహిద్‌ఖాన్‌కు కొన్నిరోజుల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. లక్కీ డ్రాలో విలువైన కారు వచ్చిందని.. దాన్ని ఇంటి వద్దకు చేర్చడానికి కొన్ని ఖర్చులు ఉంటాయని నమ్మించాడు. అయితే.. నిజమని భావించిన బాధితుడు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్సు చార్జీలు, టాక్సుల పేరిట పలు విడతలుగా రూ.17.35 లక్షల నగదును నేరస్థులకు పంపించాడు.

అనంతరం మోసగాళ్లు ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళన చెందాడు. తీరా మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసం గురించి ముజాహిద్ పోలీసులకు వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫోన్ నెంబర్లను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

Read also: Hyderabad: పోలీసులకు పాలాభిషేకం.. సత్వర న్యాయం చేసినందుకు రుణం తీర్చుకున్న బాధితుడు