Hyderabad: పోలీసులకు పాలాభిషేకం.. సత్వర న్యాయం చేసినందుకు రుణం తీర్చుకున్న బాధితుడు
భూ కబ్జాదారుల ఆట కట్టించిన సౌత్జోన్పోలీసులకు ఒక బాధితుడు ఇవాళ పాతబస్తీలో పాలాభిషేకం చేశాడు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ప్రసాద్ వర్మ, ఎస్ఐ జకీర్‌ల
South Zone Police – Anointing: భూ కబ్జాదారుల ఆట కట్టించిన సౌత్‌జోన్ పోలీసులకు ఒక బాధితుడు ఇవాళ పాతబస్తీలో పాలాభిషేకం చేశాడు. చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ప్రసాద్ వర్మ, ఎస్ఐ జకీర్‌ల చిత్ర పటాలకు బాధితుడు మహ్మద్ అఖిల్ పాలాభిషేకం చేశాడు. ఈ సందర్భంగా మహ్మద్ అఖిల్ మట్లాడుతూ.. కొబ్బరికాయలు, మిఠాయిలు విక్రయించగా వచ్చిన డబ్బును పైసా పైసా కూగడట్టుకుని 2009లో పాతబస్తీ క్యుబా కాలనీలో 200 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నానన్నారు. అయితే, సంవత్సరం నుంచి కొంత మంది భూకబ్జాదారులు తన ఇంటిపై నకిలీ పత్రాలు సృష్టించి, కబ్జాకు విశ్వ ప్రయత్నాలు చేశారని అఖిల్ తెలిపాడు.
ఇక ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్న తరుణంలో తన మిత్రులు దక్షిణమండలం డీసీపీ గజరావు భూపాల్‌కు ఫిర్యాదు చేశానన్నారు. వెంటనే ఈ విషయమై డీసీపీ సంబంధిత చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ ప్రసాద్వర్మకు చేసిన సూచనలకు ఎస్ఐ జకీర్‌లు ఆ ఇంటిపై నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జాదారులను హెచ్చరించడంతో తన కష్టార్జితంతో నిర్మించుకున్న ఇల్లు తనకు దక్కిందని.. అందుకే సంతోషంతో మహ్మద్అఖిల్పోలీసు అధికారుల చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నానని తెలిపారు.
నూర్ మహ్మమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్
Read also: Best Teachers 2021: సర్వ విద్యా ప్రదాతలు.. తెలుగు రాష్ట్రాల చిన్నారులకు ముద్దుల గురువులు ఈ నలుగురు