Telangana Corona Cases: తెలంగాణలో స్థిరంగా కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 4 వందల నుంచి 5 వందల..

Telangana Corona Cases: తెలంగాణలో స్థిరంగా కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ ఎన్ని కేసులంటే..
Corona
Follow us

|

Updated on: Aug 18, 2021 | 8:53 PM

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో రోజువారీగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా 4 వందల నుంచి 5 వందల మధ్య పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,350 శాంపిల్స్ పరీక్షించగా.. 424 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 73 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక ఒక్కరోజు 449 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇక తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 6, 53,626 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 6,42,865 మంది కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,849 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 6,912 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా వరకు కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. సీరియస్‌గా ఉన్నవారు మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో రికవరీల రేటు 98.35 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,36,57,520 సాంపిల్స్ పరీక్షించారు.

తెలంగాణలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ – 5, బద్రాద్రి కొత్తగూడెం – 7, జీహెచ్ఎంసీ – 73, జగిత్యాల – 10, జనగామ – 4, జయశంకర్ భూపాలపల్లి – 5, జోగులాంబ గద్వాల – 0, కామారెడ్డి – 1, కరీంనగర్ – 46, ఖమ్మం – 23, కొమరంభీం ఆసిఫాబాద్ – 4, మహబూబ్‌నగర్ – 4, మహబూబాబాద్ – 6, మంచిర్యాల – 10, మెదక్ – 5, మేడ్చల్ మల్కాజిగిరి – 23, ములుగు – 6, నాగర్ కర్నూలు – 3, నల్లగొండ – 24, నారాయణ పేట – 1, నిర్మల్ – 3, నిజామాబాద్ – 6, పెద్దపల్లి – 21, రాజన్న సిరిసిల్ల – 8, రంగారెడ్డి – 27, సంగారెడ్డి – 7, సిద్ధిపేట – 17, సూర్యాపేట – 19, వికారాబాద్ – 3, వనపర్తి – 4, వరంగల్ రూరల్ – 15, వరంగల్ అర్బన్ – 24, యాదాద్రి భువనగిరి – 10 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Also read:

Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ కలకలం.. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

Afghanistan Crisis: ఖజానాను దొంగిలించాడు.. అష్రఫ్‌ ఘనీని అరెస్ట్ చేయండి.. ఇంటర్‌పోల్‌కు ఆఫ్గన్ రాయబార కార్యాలయం ఫిర్యాదు..

Viral Video: కుక్కను వేటాడిన పిల్లులు.. భయంతో పరుగు లంకించుకున్న శునకం.. ఫన్నీ వీడియో మీకోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు