Viral Video: కుక్కను వేటాడిన పిల్లులు.. భయంతో పరుగు లంకించుకున్న శునకం.. ఫన్నీ వీడియో మీకోసం..

Viral Video: సహజంగానే కుక్క, పిల్లి వైరి జీవులు. రెండింటికీ అస్సలు పడదు. ఒకవిధంగా చెప్పాలంటే పిల్లి కుక్కకు ఆహారం. అందుకే.. కుక్కను చూసి పిల్లులు హడలిపోతాయి.

Viral Video: కుక్కను వేటాడిన పిల్లులు.. భయంతో పరుగు లంకించుకున్న శునకం.. ఫన్నీ వీడియో మీకోసం..
Cat Attack On Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 18, 2021 | 7:45 PM

Viral Video: సహజంగానే కుక్క, పిల్లి వైరి జీవులు. రెండింటికీ అస్సలు పడదు. ఒకవిధంగా చెప్పాలంటే పిల్లి కుక్కకు ఆహారం. అందుకే.. కుక్కను చూసి పిల్లులు హడలిపోతాయి. కుక్క అంతదూరంలో ఉండగానే.. పిల్లి ఇక్కడి నుంచి ఉడాయిస్తుంది. అయితే, కొన్ని సాదు జంతువులు మాత్రం కలిసిమెలిసి ఉంటాయి. పిల్లి, కుక్క రెండూ గాఢమైన స్నేహంలో మునిగి తేలుతుంటాయి. అది వేరే విషయం. ప్రకృతి ప్రకారం అయితే, పిల్లి, కుక్కు అస్సలు పడదు. తేడా వస్తే.. పిల్లి కుక్కకు ఆహారంగా మారిపోవడం ఖాయం. అయితే, ఇప్పటి వరకు పిల్లిని కుక్క వేటాడటం మాత్రమే చూసుంటారు. మరి కుక్కను పిల్లి వేటాడం ఎప్పుడైనా చూశారా? పిల్లి వేటాడితే ఎలా ఉంటుందో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో చూస్తే కచ్చితంగా నవ్వు ఆపుకోలేరు. ఆ రేంజ్‌లో కుక్కను భయపెట్టించాయి పిల్లులు.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే వైరల్ అవుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు అయితే ఇక చెప్పనక్కర్లేదు అనాలి. ప్రతి రోజూ వందలాది వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోను వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఇంటి బయట కొన్ని పిల్లులు బయట నిలబడి ఉన్నాయి. ఇంతలో ఓ కుక్క వాటిని సమీపించింది. ఆ కుక్కను చూసి ఓ పిల్లి పారిపోగా.. నాలుగు పిల్లులు మాత్రం ఏమాత్రం భయపడకుండా అక్కడి నిల్చున్నాయి. కుక్క దగ్గరికి వచ్చినప్పటికీ ఏమాత్రం బెదరలేదు. పైగా కుక్కనే హడలెత్తించేలా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టాయి. పిల్లుల ధైర్యానికి భీతిల్లిన ఆ కుక్క.. వెనక్కి మళ్లింది. మళ్లీ ఏమైందో ఏమో గానీ.. పిల్లుల వద్దకు వెళ్లింది. వాటికి దూరంగా నడుచుకుంటూ వెళ్తున్నట్లే వెళ్లి.. ఎటాక్ చేయబోయింది. మరి పిల్లి ఊరుకుందా? అంటే ఛాన్సే లేదు. రివర్స్ కుక్కపైనే ఎదురు దాడి చేసింది. దాంతో కుక్క పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి లంకించుకుంది. ఈ సీన్‌ను అంతా అక్కడి వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను తాజాగా ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పిల్లుల ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. కుక్కను భయపెట్టిన తీరు చూసి నవ్వుకుంటున్నారు. పిల్లుల ఐక్యతకు సలాం కొడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

Viral News: ప్రేయసి కోసం ఈ దునియాలోనే ఎవరూ చేయని పని చేశాడు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు..

Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..

Suspect Fire Accident: కర్నూలు జిల్లాలో వింత అగ్ని ప్రమాదం.. ఆ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..