Viral News: ప్రేయసి కోసం ఈ దునియాలోనే ఎవరూ చేయని పని చేశాడు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు..

Viral News: ప్రేయసి కోసం ఈ దునియాలోనే ఎవరూ చేయని పని చేశాడు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యాడు..
Exam

Viral News: ప్రపంచవ్యాప్తంగా కరోనా భయంకరమైన పరిస్థితులు సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా జనాలు భయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు.

Shiva Prajapati

|

Aug 18, 2021 | 7:15 PM

Viral News: ప్రపంచవ్యాప్తంగా కరోనా భయంకరమైన పరిస్థితులు సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా జనాలు భయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. చుట్టు పక్కన వారు దగ్గినా.. తుమ్మినా.. భయంతో హడలిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలా దేశాలకు విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు సెలవులు ప్రకటించాయి. ఎగ్జామ్స్ పెట్టకుండానే పరీక్షలు పాస్ చేసేశారు. అయితే, కొన్ని ముఖ్యమైన పరీక్షలు మాత్రం నిర్వహించారు. అయితే, కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన విద్యార్థులు.. సబ్జెక్టులను పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది విద్యార్థులు విద్యాభ్యాసంపై అలర్ట్‌గా ఉండగా.. మరికొందరు మాత్రం పూర్తిగా విస్మరించిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వారే పరీక్షలంటే జడుసుకున్నారు. ఏం చేయాలో పాలుపోక తిప్పలు పడ్డారు. అయితే, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ యువతికి.. ఆమె ప్రియుడు అండగా నిలిచేందుకు ప్రయత్నించాడు. పరీక్షలో చిట్టీలు అందించడం సాధ్యం కాదని భావించిన ఆ యువకుడు.. ఏకంగా యువతి వేషం ధరించి పరీక్షకు హాజరయ్యేందుకు ప్రయత్నించాడు. తొలి మూడు రోజులు అతని ప్రయోగం సక్సెస్ అయ్యింది. కానీ, నాలుగో రోజు అతని పప్పులు ఉడకలేదు. అతని తీరుపై అనుమానం వచ్చిన అధికారులు.. అడ్డంగా బుక్ చేశారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ దేశంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సెనెగల్ దేశానికి చెందిన ఖాదీమ్ ఎంబూప్.. గాస్టన్ బెర్గర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతనికి గంగూ డియోమ్ అనే ప్రియురాలు ఉంది. తాజాగా ఆమెకు హైస్కూల్ గ్రాడ్యూయేషన్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే, ఆ యువతి పరీక్షలు రాసి పాస్ అయ్యే పరిస్థితి లేదు. దాంతో అతనే ఆ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవు.. ఎంబూప్ ఆడ వేశం వేశాడు. డ్రెస్, మేకప్, మొత్తం సెటప్‌నే మార్చేశాడు. మొత్తానికి ఎవరికీ అనుమానం రాకుండా తొలిరోజు ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశించి గంగూ డియోమ్ తరఫున మొదటి పరీక్ష రాసేశాడు. ఇలా మూడు రోజులు ప్రశాంతంగా సాగింది. కానీ, నాలుగో రోజు.. అతని ప్రవర్తనపై ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చింది. అతన్ని చెక్ చేయగా.. అసలు గుట్టు రట్టు అయ్యింది. అడ్డంగా బుక్కయ్యాడు. అతన్ని స్థానిక పోలీసు అధికారులకు అప్పగించాడు. వారు అతన్ని విచారించగా.. తన ప్రేయసి కోసమే ఈ పరీక్ష రాసినట్లు అంగీకరించాడు. దాంతో ఈ ప్రేమ పక్షులిద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో దోషులని తేలితే.. వారిద్దరూ ఐదేళ్ల పాటు డిబార్ అవుతారు. అలాగే వారికి సర్టిఫికెట్ కూడా లభించదు. ఈ జంటకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

ఈ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తోంది. ప్రేయసి కోసం ఆ యువకుడు చేసిన పనిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అతని ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. ప్రియురాలిని పాస్ చేయించేందుకు అతను చేసిన సహాసాన్ని కొనియాడుతున్నారు. ప్రియురాలి కోసం ప్రియుడు ఏదైనా చేస్తాడని ఈ ఘటనతో మరోమారు నిరూపితం అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also read:

Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..

Suspect Fire Accident: కర్నూలు జిల్లాలో వింత అగ్ని ప్రమాదం.. ఆ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..

Tsunami Threat Vanuatu: వనౌతులో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జియోలాజికల్ సర్వే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu