Afghanistan Crisis: ఆఫ్ఘన్ లో తాలిబన్ రాక్షస పాలన.. లోలోపల సంబరాలు చేసుకుంటున్న ఆ దేశాలు.. కారణాలు ఇవే!
చరిత్ర చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ముష్కర తాలిబన్ చేతిలో అష్టకష్టాలు పడి.. అమెరికా జోక్యంతో కుదుటపడిన ఆ దేశం..అమెరికా పక్కకు జరిగిన వెంటనే రాక్షస పాలనలోకి వెళ్ళిపోయింది.
Afghanistan Crisis: చరిత్ర చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ముష్కర తాలిబన్ చేతిలో అష్టకష్టాలు పడి.. అమెరికా జోక్యంతో కుదుటపడిన ఆ దేశం.. అమెరికా పక్కకు జరిగిన వెంటనే రాక్షస పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనలు ప్రపంచం మొత్తాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. ఈ దిగ్భ్రాంతికర ఘటన నుంచి..దాని వెనుకే జరుగుతున్న పరిణామాల నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ.. రెండు దేశాలు మాత్రం రాక్షస తాలిబన్లకు తమ మద్దతును క్షణాల్లో ప్రకటించేశాయి. అవి రెండూ భారత్ పై ఎప్పుడెప్పుడు విరుచుకుపడదామా అని చూసే దేశాలే కావడం పెద్దగా ఆశ్చర్యపరిచదు. ఈ పాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఆ దేశాలు ఏమిటో. అవును.. అవి పాకిస్తాన్..చైనా.
విపరీతమైన రాజ్యకాంక్షతో రగిలిపోతూ ఉండే దేశం చైనా.. ఇప్పటికే భారత్ తో ఘర్షణల దారిలో ఉన్న పాకిస్తాన్ ను తన మిత్రవర్గంలో చేర్చుకుంది. ఇప్పుడు అఫ్గనిస్థాన్ లోని తాలిబన్ పాలనకు మద్దతు పలకడం ద్వారా రెండు చేతుల్లోనూ లడ్డూలు దక్కినంత సంబరం జరుపుకుంటోంది. ఇక పాకిస్తాన్.. సహజంగానే అది తాలిబన్ కు మద్దతు ఇస్తుంది. దానికి ఇంకో మార్గం లేదు కూడా. మనం ఎన్ని చెప్పుకున్నా ఈ రెండు దేశాలకు.. భారత్ వ్యతిరేకతే ముఖ్యం. అందుకోసం ఎటువంటి పనికైనా సిద్ధం అవుతాయి. గత పాలనలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఏమి చేశారనేది రెండు దశాబ్దాలు గడిచినా ప్రపంచము మర్చిపోలేదు. ఆ దేశ ప్రజలూ మర్చిపోలేదు. ఆఫ్ఘన్ లో ఏర్పడబోతున్న తాలిబన్ రాజ్యానికి ప్రజల మద్దతు లేదు అనేదానికి గత రెండురోజులుగా అక్కడ నుంచి పరుగులు తీస్తున్న ప్రజలే నిదర్శనం. తాలిబన్ పాలనలో బాధల కంటే.. బతికుంటే చాలు అన్నట్టుగా ఉన్నాయి. ప్రజల్ని అంత భయభ్రాంతులకు గురిచేస్తున్న పాలకులకు మద్దతు అదీ అతి తొందరగా తెలపడంతోనే పాకిస్తాన్.. చైనాల దుర్భుద్ధి తెలుస్తుంది.
అసలు చైనా..పాకిస్తాన్ ఇంత హడావుడిగా.. ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలనకు మద్దతు ప్రకటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కారణాలు ఏమిటో చూద్దాం..
తాలిబ్లనకు పాక్ మద్దతు ఎందుకంటే..
1. పాకిస్తాన్ తో అఫ్గానిస్తాన్ సరిహద్దు 2,252 కి.మీ 2. భారత్ వైరి దేశంగా పాక్ 3. కశ్మీర్ విషయంలో తాలిబన్లు సాయం చేస్తారనే ఆశ 4. భారత్ పై పోరులో ఆప్ఘన్ సాయం చేస్తుందనే ఆలోచన 5. భౌగోళిక, ఆర్థిక, సైనిక, సౌహార్థ సాయం చేస్తుందనే అంచనా 6. ఆర్థిక కోరల్లో చిక్కుకున్న పాక్, బయటపడేందుకు ఎదురుచూపు 7. తమ వాణిజ్య, వ్యాపారాలకు ఆప్ఘనిస్తాన్ ను వాడుకునే అవకాశం 8. 1999లోను తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంగీకరించిన పాక్ 9. అఫ్గానిస్తాన్ కు స్వేచ్ఛ లభించిందని పాక్ ప్రకటన 10. అంతర్గత పోరు జరగకుండా తాలిబన్ల సాయం తీసుకునే వీలు
తాలిబన్లతో చైనా స్నేహం ఎందుకంటే
1. ఆఫ్ఘనిస్తాన్‌తో చైనాకు 76 కి.మీ సరిహద్దు, అన్నిటికీ దగ్గర. 2. చైనాలో వీఘర్ తీవ్రవాద ఉద్యమం 3. వారికి ఆప్ఘన్ కేంద్రంగా మారుతుందని ఆందోళన 4. వేర్పాటువాదులకు తమ మద్దతు ఇవ్వకుండా తాలిబన్ల పై ఒత్తిడి 5. నెల రోజుల కిందట చైనా విదేశాంగ మంత్రిని కలిసిన తాలిబన్లు 6. ఇరువురి మధ్య ఒప్పందం, తొలి నుంచి సాయం 7. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం 8. ప్రతిగా చైనా మైనార్టీల ఉద్యమానికి తమ మద్దతు ఉండదన్న తాలిబన్లు 9. ఆప్ఘాన్ లో అమెరికా దళాలు ఉండటం చైనాకు ఇష్టం లేదు 10. చైనాతో సత్సంబంధాలు కోరుకుంటున్న తాలిబన్లు 11. తాలిబన్లు తాము చెప్పినట్లు నడుచుకుంటారనే భావన 12. తమ భౌగోళిక-వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం సంబంధాలు 13. చైనా సరిహద్దుకు దగ్గరి దేశాల్లో తమ శత్రుదేశాలు లేకుండా చూడటం 14. తూర్పు తుర్కెస్తాన్ ఇస్లామిక్ ఉద్యమాన్ని తాలిబాన్ అణస్తుందనే భావన 15. తమ వ్యాపార, వాణిజ్య విస్తరణకు ఆప్ఘన్ ను వాడుకునే అవకాశం
Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై భారత్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది?