AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..

Wild Life: క్రూర మృగాల జాబితాలో చిరుతను ప్రధానంగా పేర్కొనవచ్చు. రెప్పపాటు వ్యవధిలో ఎరను వేటాడేస్తుంది. చిరుత వేట కూడా మిగతా జంతువుల కంటే భిన్నంగా.. క్రూరంగా ఉంటుంది.

Viral Video: చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..
Leopard
Shiva Prajapati
|

Updated on: Aug 18, 2021 | 6:21 PM

Share

Wild Life: క్రూర మృగాల జాబితాలో చిరుతను ప్రధానంగా పేర్కొనవచ్చు. రెప్పపాటు వ్యవధిలో ఎరను వేటాడేస్తుంది. చిరుత వేట కూడా మిగతా జంతువుల కంటే భిన్నంగా.. క్రూరంగా ఉంటుంది. సింహం, పులి నేలపైనే వేటాడితే.. చిరుత మాత్రం చెట్టుపై నుంచి కూడా వేటాడుతుంది. అడవిలో ఉండే చిన్న జీవాలకు కనిపించకుండా చెట్టుపై మాటు వేసి.. వేటాడి ఆకలి తీర్చుకుంటుంది. అంతేకాదు.. తాను వేటాడిన జంతువును మరే జంతువు కూడా లాక్కోవద్దనే ఉద్దేశంతో ఒక్కోసారి వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టుపైకి ఎక్కి ప్రశాంతంగా ఆరగిస్తుంటుంది.

తాజాగా చిరుతకు సంబంధించి ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో చిరుత వేట ఎంత భయంకరంగా ఉంటుందో స్పష్టమవుతోంది. మాంచి ఆకలి మీదున్న చిరుత పులి.. ఇతర జంతువుల కోసం గాలించింది. సమీపంలోనే జింకలు ఉండగా.. రిస్క్ లేకుండా వేటాడాలని భావించింది. వాటికి కనిపించకుండా ఉండేందుకు ఓ చెట్టును ఎక్కేసింది. జింకల వైపు నక్కి నక్కి చూస్తోంది. జింకలు గడ్డి మేస్తూ చిరుత ఉన్న చెట్టును సమీపించాయి. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న చిరుతకు టైమ్ రానే వచ్చింది. ఓ జింక సరిగ్గా.. తాను చెట్టు కిందకు రాగానే చిరుత ఒక్క ఉదూటున దూకేసింది. జింకపై అమాంతం దూకి మెడను పట్టేసింది. చిరుత పులి ఎటాక్‌కి జింక నిస్సహాయంగా ప్రాణాలు వదిలింది. ఆ తరువాత.. జింక మెడను నోట కరుచుకుని లాక్కెల్లింది. దానిని పట్టుకుని నేరుగా చెట్టుపైకి ఎక్కి హాయిగా ఆరగించింది.

ఇదంతా వీడియోలో రికార్డ్ అవ్వగా.. ఆ వీడియోను యూట్యూబ్ ఛానెల్(Leopard – Cheetah Channel)లో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో పాతదే అయినా.. మరోసారి ట్రెండింగ్‌లో నిలిచి.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిరుత వేట ఇంత భయంకరంగా ఉంటుందా? అంటూ గగుర్పాటుకు గురవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది వీక్షించారు. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరుత వేటను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

Bandla Ganesh: బండ్ల గణేష్ బ్యాక్ టూ ట్విట్టర్.. అన్నొచిండు అంటూ కామెంట్లు పెడుతున్న అభిమానులు..

Suspect Fire Accident: కర్నూలు జిల్లాలో వింత అగ్ని ప్రమాదం.. ఆ ఇంట్లో గంట గంటకు చెలరేగుతున్న మంటలు..

Tsunami Threat Vanuatu: వనౌతులో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన యూఎస్ జియోలాజికల్ సర్వే..