‘చదువుకుంటే ప్రశ్నిస్తారని ఆ వర్గాలను చదువులకు దూరం చేస్తున్నారు, కాంగ్రెస్ ఏనాడూ ఓట్లకోసం పథకాలు తేలేదు’

'చదువుకుంటే ప్రశ్నిస్తారని ఆ వర్గాలను చదువులకు దూరం చేస్తున్నారు, కాంగ్రెస్ ఏనాడూ ఓట్లకోసం పథకాలు తేలేదు'
Revanth Reddy

కేసీఆర్ ఎంగిలిమెతుకలకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా లేరంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళిత బిడ్డ ప్రదీప్ చంద్రను సీఎస్‌గా ఒక్క నెలకే ఎందుకు

Venkata Narayana

|

Aug 18, 2021 | 9:09 PM

Revanth Reddy – Mulugu MLA Seethakka: కేసీఆర్ ఎంగిలిమెతుకలకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా లేరంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళిత బిడ్డ ప్రదీప్ చంద్రను సీఎస్‌గా ఒక్క నెలకే ఎందుకు రిటైర్ చేశావంటూ ఆయన ప్రశ్నించారు. బానిసలుగా పనిచేయలేక ఐఏఎస్ ఉద్యోగాలకు మురళి, ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని రేవంత్ చెప్పుకొచ్చారు.

ఇవ్వాల రాహుల్ బొజ్జను సిఎంవో లో పెట్టుకుంటే కేసీఆర్ ను ఎవరు నమ్ముతారని వ్యాఖ్యానించిన రేవంత్.. హుజురాబాద్‌లో ఓట్లు అవసరం కాబట్టే బయటకు వచ్చారని అన్నారు. “చదువుకుంటే ప్రశ్నిస్తారని ఆ వర్గాలను చదువులకు దూరం చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే ఆయనకు ద్రోహం చేసి కేటీఆర్‌కు టిక్కెట్ ఇచ్చారు. చంద్రబాబును బతిమాలుకుని కేటీఆర్ గెలిచారు.” అని రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు.

అటు, ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం కేసీఆర్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓట్ల కోసం పథకాలు తేలేదన్న ఆమె, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. “దొరలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగిన గడ్డ ఇది.. సీఎం కేవలం నెల రోజులుగా బయట కనిపిస్తున్నారు. అంతకు ముందు కేసీఆర్ గడికట్టుకుని గడీలోనే కూర్చున్నారు. మంద కృష్ణ మాదిగ ను 40రోజులు జైల్ లో పెట్టిన చరిత్ర కేసీఆర్ ది. దళిత, గిరిజన, ఆదివాసీ బిడ్డలను కేసులు పెట్టి వేధిస్తున్నారు. సీఎం పదవి, మూడెకరాల భూమి ఇవ్వని కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలి” అని సీతక్క ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Read also: Nagam: చాలా కాలానికి మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేసిన నాగం జనార్థన్ రెడ్డి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu