BJP: ఉత్తరాఖండ్ , గోవాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రులే.. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం..
ఉత్తరాఖండ్ , గోవాలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులనే కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామికి మరోసారి సీఎం పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికి..
ఉత్తరాఖండ్(Uttarakhand) , గోవాలో(Goa) ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులనే కొనసాగించాలని బీజేపీ(BJP ) అధిష్టానం నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామికి మరోసారి సీఎం పదవి దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో ధామి ఓడిపోయినప్పటికి బీజేపీ గెలిచింది. అయితే ఆరునెలల క్రితమే సీఎం పగ్గాలు చేపట్టిన ధామి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన శ్రమను గుర్తించిన అధిష్టానం రెండోసారి సీఎం పదవిని కట్టబెట్టింది. డెహ్రాడూన్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో పుష్కర్‌సింగ్ ధామిని నేతగా ఎన్నుకున్నారు. అధిష్టానం పరిశీలకులుగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ , మీనాక్షి లేఖి ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ ఆశీర్వాదంతో ఉత్తరాఖండ్‌ను అన్నిరంగాల్లో అభివృద్ది చేస్తానని తెలిపారు ధామి. 46 ఏండ్ల పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎం అయ్యారు. సొంత నియోజకవర్గం ఖతిమా నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అయితే ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ మరోసారి విజయం సాధించింది. దీంతో పార్టీకి నేతృత్వం వహించి గెలుపు కోసం కృషి చేసిన పుష్కర్ సింగ్ ధామికి సీఎంగా మరో అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.
గోవాలో కూడా మరోసారి ప్రమోద్ సావంత్‌కే ముఖ్యమంత్రి పగ్గాలు దక్కాయి. మిత్రపక్షాల మద్దతులో బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. గోవా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నేతగా ప్రమోద్ సావంత్‌ను ఎన్నుకున్నారు. కేంద్రమంత్రి నరేందర్‌సింగ్ తోమర్ పార్టీ పరిశీలకుడిగా గోవా వచ్చారు. గోవా బీజేపీ ఇంచార్జ్ , మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
గోవా సీఎం పదవి కోసం పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. అయితే చివరకు ప్రమోద్ సావంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది.
ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?
Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..