Delhi Liquor Scam: ఆప్‌ నేతలకు ముడుపులు అందాయన్న లిక్కర్ హోల్‌సేల్ డీలర్.. ఢిల్లీ మద్యం కుంభకోణంపై స్టింగ్ ఆపరేషన్ వీడియోలు..

స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయని అన్నారు బీజేపీ నేత సుధాంశ్‌ త్రివేది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా లిక్కర్‌ స్కాంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Delhi Liquor Scam: ఆప్‌ నేతలకు ముడుపులు అందాయన్న లిక్కర్ హోల్‌సేల్ డీలర్.. ఢిల్లీ మద్యం కుంభకోణంపై స్టింగ్ ఆపరేషన్ వీడియోలు..
Delhi Liquor Scam
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2022 | 2:23 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై బీజేపీ-ఆప్‌ నేతల మధ్య మాటలయుద్ధం మరింత ముదిరింది. మద్యం వ్యాపారుల నుంచి ఆప్‌ నేతలకు కోట్ల రూపాయలు ముడుపులు అందాయని బీజేపీ మరో స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియో విడుదల చేసింది. లిక్కర్‌ స్కాం డబ్బులను ఆప్‌ నేతలు పంజాబ్‌ , గోవా ఎన్నికల్లో ఉపయోగించారని తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేతలు . లిక్కర్ హోల్‌సేల్ డీలర్ అమిత్ అరోరా మాట్లాడిన టేప్‌ను బీజేపీ నేతలు విడుదల చేశారు.

లిక్కర్ స్కాంలో ఉన్నవారి పేర్లను వెల్లడించాడు అమిత్ అరోరా. ఎవరికి ఎంత ఇచ్చారో, ఎంత మొత్తం డబ్బు చేతులు మారిందో వీడియోలో వివరించాడు అమిత్. గుజరాత్‌కు అక్రమంగా వెళ్తున్న మధ్యం ఢిల్లీ నుంచి వెళ్తున్నట్టు తెలిపాడు. పంజాబ్‌లో అమ్ముతున్న లిక్కర్ కూడా ఢిల్లీ నుంచే సరఫరా అవుతున్నట్టు వెల్లడించాడు. ఢిల్లీలోని ఒబెరాయ్, లోధి హోటళ్లలో కూర్చుని లిక్కర్ పాలసీ తయారుచేశారని తెలిపాడు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, జస్‌దీప్ కౌర్ చెడ్డా, సమీర్ మహేంద్ర, అమండల్ సహా మరికొందరు కలిసి ఈ పాలసీ తయారు చేశారని ఆరోపించాడు. ఈ స్టింగ్ అపరేషన్ వీడియోలో ఉన్న వ్యక్తి లిక్కర్ స్కాంలో 9వ నిందితుడు.

స్టింగ్ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయని అన్నారు బీజేపీ నేత సుధాంశ్‌ త్రివేది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా లిక్కర్‌ స్కాంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లిక్కర్‌ స్కాంలో సంబంధం ఉన్న వాళ్లపై ఆధారాలు కోర్టు లోనే సమర్పిస్తామని చెప్పారు.

బీజేపీ స్టింగ్‌ ఆపరేషర్‌ పెద్ద జోక్‌ అని అన్నారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా. స్టింగ్‌ ఆపరేషన్ల పేరుతో డ్రామాలాడుతున్న బీజేపీ నేతలు ఆ వీడియోలను సీబీఐకి ఇచ్చి తనను అరెస్ట్‌ చేయించుకోవచ్చన్నారు. బీజేపీకి అనుబంధ సంస్థగా ఉన్న సీబీఐ ఈ స్టింగ్‌ ఆపరేషన్‌పై నాలుగు రోజుల్లో విచారణ పూర్తి చేసిన తనను అరెస్ట్‌ చేయాలని సవాల్‌ విసిరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..