AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Age: వారి రిటైర్మెంట్ వయసు 67ఏళ్లకు పెంపు.. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

రాజ్యాంగంలో తక్షణ సవరణ జరగాలని, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 67 ఏళ్లకు పెంచాలని..

Retirement Age: వారి రిటైర్మెంట్ వయసు 67ఏళ్లకు పెంపు.. బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..
Supreme Court
Sanjay Kasula
|

Updated on: Sep 15, 2022 | 2:37 PM

Share

న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 67 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించింది. రాష్ట్ర బార్​ కౌన్సిల్​లు.. బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. పదవీ విరమణ వయసుపై తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానంలో పేర్కొంది.  వయో పరిమితి పెంపు తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.

అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు ఛైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని కూడా బార్‌ కౌన్సిల్‌ తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తీర్మాన కాపీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజుకు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉండగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది.

గత వారం జరిగిన అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించి సమస్యను చర్చించింది. ఇదే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంతలో, వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు అనుభవజ్ఞులైన న్యాయవాదులను కూడా చైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంటుకు ప్రతిపాదించాలని కూడా ఉమ్మడి సమావేశం తీర్మానించింది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం..

6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయ్.? షాకింగ్ విషయాలు మీకోసం
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే..
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
ఐపీఎల్‌లో నిషేధం.. కట్‌చేస్తే.. రూ. 5.6 కోట్లతో కొనేసిన కావ్యపాప
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
కరెంట్ ఛార్జీలపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలకు బిగ్ రిలీఫ్..
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్
ఒక్క మెసేజ్.. 45 బైకులు..దొంగ సామ్రాజ్యాన్ని బయటపెట్టిన ఈ-చలాన్